E-Paper
Advertisement

Biryani: బిర్యానీలో ఏదో తేడాగా కనిపించింది.. ఏంటబ్బా అని చూశాడు, అదేంటో తెలిసి కస్టమర్ షాక్!

Biryani: బిర్యానీలో ఏదో తేడాగా కనిపించింది.. ఏంటబ్బా అని చూశాడు, అదేంటో తెలిసి కస్టమర్ షాక్!
Advertisement

హైదరాబాద్‌లోని బిర్యానీ క్వాలిటీకి సంబంధించిన అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని మలక్‌పేటలో ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీకి పెట్టింది పేరుగా భావించే హోటళ్లలో పరిశుభ్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన అద్దం పడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిర్యానీలో బొద్దింక..

Advertisement

మలక్‌పేట-మూసారాంబాగ్ చౌరస్తాలో ఉన్న ఆజెబో (Ajebo) రెస్టారెంట్‌లో విరక్తి కలిగించిన ఘటన చోటుచేసుకుంది. ఒక కస్టమర్ తన ఆకలి తీర్చుకోవడానికి ఎంతో ఇష్టంగా బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. అయితే, వడ్డించిన బిర్యానీని తినడం ప్రారంభించే లోపే అందులో చనిపోయి ఉన్న బొద్దింక కనిపించడంతో ఆ కస్టమర్  ఒక్కసారిగా ఖంగుతిన్నారు. హోటల్ యాజమాన్యం అనుసరిస్తున్న అపరిశుభ్రత పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సిబ్బంది ఏమన్నారంటే..?

Advertisement

బిర్యానీలో బొద్దింక వచ్చిన విషయాన్ని సదరు కస్టమర్ వెంటనే రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. కనీసం క్షమాపణలు చెప్పి తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి.. సిబ్బంది ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కస్టమర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో చిన్న విషయం జరిగినట్లుగా వారు మాట్లాడటం, కస్టమర్ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో వివాదం మరింత పెద్దదైంది. డబ్బులు తీసుకుని నాణ్యత లేని, అనారోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే కాకుండా.. ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనీస బాధ్యత లేకుంటే ఎలా..?

నగరంలోని అనేక రెస్టారెంట్లు కేవలం లాభాపేక్షతోనే నడుస్తున్నాయని.. కస్టమర్ల ఆరోగ్యం పట్ల కనీస బాధ్యత ఉండటం లేదని ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది. కిచెన్‌లలో కనీస శుభ్రత పాటించకపోవడం, నిల్వ ఉంచిన పదార్థాలను వాడటం వంటి పనుల వల్ల ప్రజలు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నారు. గతంలో కూడా మలక్‌పేట పరిసర ప్రాంతాల్లోని పలు హోటళ్లపై జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు దాడులు నిర్వహించినా, పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదని స్పష్టమవుతోంది.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆజెబో రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కస్టమర్‌తో పాటు నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి.. సదరు హోటల్‌లో తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే భారీ జరిమానాతో పాటు లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతున్నారు. బయట హోటళ్లలో తినేముందు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: Most Expensive Helmets: ఈ బైక్ హెల్మెట్ ధర రూ.2.3 కోట్లు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×