E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యో పెళ్లి చేయాలన్న సుమిత్ర 

Karthika Deepam 2 Serial Today Episode August 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యో పెళ్లి చేయాలన్న సుమిత్ర 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: దీప కావాలనే తనను ఒక అనాథకు ఇచ్చి చేయాలని ప్లాన్‌ చేసిందని సూరజ్‌ ను వెంటనే ఇంట్లోంచి ఆఫీసులోంచి బయటకు గెంటివేయమని చెప్పి వెళ్లిపోతుంది. శివనారాయణ చెప్పినా వినకుండా జ్యో కోప్పడటంతో అందరూ ఆలోచనలో పడిపోతారు. కార్తీక్, దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. అప్పుడే జ్యో బయటకు వచ్చి కార్తీక్‌ ను తిడుతుంది. దీంతో దీప కోపంగా ఇంట్లో చేసిన గొడవ చాలు మళ్లీ గొడవ చేయకు అంటుంది. కానీ జ్యోత్స్న వినదు.. సూరజ్‌ అనాథ అని మీకు ముందే తెలుసు.. తెలిసి కూడా మీరు కావాలనే నా పెళ్లి చేయాలని చూస్తున్నారు కదా..? అంటూ తిడుతుంటే.. దీప కోపంగా జ్యోత్స్నను తిడుతూ.. సూరజ్‌ గురించి సూరజ్‌ గొప్పదనం గురించి చెప్తుంది. వెనక నుంచి సుమిత్ర వచ్చి వింటుంది. దీప చెప్పిన మాటలు విన్న సుమిత్ర కూడా తన మనసులో ఉన్న మాటే చెప్పింది అనుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. కార్తీక్‌, దీప ఇంటికి వెళ్లిపోతారు.

సూరజ్‌ అనాథ అని తెలిసి కాంచన బాధపడతుంది. శ్రీధర్‌ కూడా బాధపడతాడు. కానీ సూరజ్‌ మంచి వ్యక్తి అని జ్యోత్స్నకు అంతకంటే మంచి వాడు దొరకడని మామయ్యగారు ఈ పెళ్లికి ఒప్పుకుంటే బాగుండు అని చెప్పగానే.. కాంచన ఒప్పుకోడని చెప్తుంది. జ్యోత్స్నను నలుగురు ఉన్న కుటుంబంలోకి ఇవ్వాలని అనుకుంటాడు అని చెప్పగానే.. దీప మాత్రం జ్యోత్స్నకు శివనారాయణకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టుంది అని చెప్తుంది. ఇంతలో కాంచన వెళ్లి చేతులు కడుక్కుని రండి భోజనం చేద్దాం అంటుంది. సూరజ్ మంచోడు ఈ పెళ్లి జరిగితే బాగుండు.. మీ వల్ల ఏదైనా జరిగితే చేయండి అని చెప్పి శ్రీధర్‌ వెళ్లిపోతాడు. దీప అడిగితే మన చేతుల్లో ఏమీ లేదని అంతా అత్త చేతుల్లో ఉందని అంటాడు కార్తీక్‌.

Advertisement

సూరజ్‌ రూంలోకి వెళ్లి కోపంగా సూరజ్‌ను కొట్టి నన్ను ట్రాప్‌ చేయమని ఎవరు చెప్పారు. ఎంతకు అమ్ముడుపోయావు.. చెప్పు ఆ దీప చెప్పిందా..? మా బావ చెప్పాడా..? మా బావ చెప్పడులే.. ఆ దీపే చెప్పి ఉంటాది. మీ అనాథల బ్యాచంతా నన్ను తగులుకుందేంటిరా..? అంటూ తిడుతుంటే. ఈరోజు కొత్తగా అడుగుతున్నావేంటి..? డే వన్‌ నుంచే నేను నిన్ను లవ్‌ చేస్తున్నాను పెళ్లి చేసుకుందాం అని అడిగాను కదా అంటాడు సూరజ్‌. అప్పుడెప్పుడు నువ్వు ఇంత ఆవేశపడలేదే అని అడగ్గానే.. నేను ఎప్పుడు ఆవేశపడాలో నువ్వే చెప్పాలా..? చస్తే.. అడిగే దిక్కు లేదు పెళ్లి చేసుకుంటే పెళ్లాన్ని ఎక్కడికి తీసుకెళ్తావురా..? నీకు ఉన్నది ఒక్కటే ప్లాట్‌ ఫాం.. నువ్వు అక్కడే ఒక టెంట్‌ వేసి అక్కడే కాపురం పెడతావా..? నీలాంటోళ్లు ఏం చేయాలి పెళ్లి కోసం అనాథ శరణాలయానికి వెళ్లాలి. అక్కడ ఎవరో ఒక అనాథకు తాళి కట్టి పెళ్లి చేసుకోవాలి అంటూ తిడుతుంది. దీంతో సూరజ్‌ అసలు నీకేం కావాలి చెప్పు అని అడగ్గానే.. నేను అడిగింది ఇస్తావా..? అని జ్యో అడిగితే ఇస్తాను అని చెప్తాడు అయితే నువ్వు అవుట్‌ హౌస్‌ వదిలేసి వెళ్లిపో అని చెప్తుంది. సూరజ్‌ సరే అంటాడు.

సుమిత్ర, కాంచనను ఉదయమే ఇంటికి రమ్మని చెప్తుంది. సుమిత్ర, శ్రీధర్‌, కార్తీక్‌, దీప నలుగురు ఇంటికి రాగానే బయటకు వెళ్లి పలకరిస్తుంది. ఎందుకు రమ్మన్నావు అని అడిగితే సూరజ్‌తో జ్యోత్స్న పెళ్లి గురించి శివనారాయణకు మీరే చెప్పాలని అనగానే.. కాంచన భయపడుతుంది. అమ్మో నాన్నకు చెప్పడమా..? అనగానే.. నువ్వు చెప్తేనే వింటాడని సుమిత్ర అంటుంది. అందరూ కలిసి శివనారాయణ, జ్యోత్స్నను ఒప్పించాలని డిసైడ్‌ అవుతారు. వెంటనే అందరూ ఇంట్లోకి వెళ్తారు. జ్యోత్స్నను పిలుస్తారు. జ్యోత్స్న పారిజాతం వస్తారు. అందరినీ చూసి పారిజాతం షాక్‌ అవుతుంది. సుమిత్ర ఏదో గట్టిగానే ప్లాన్‌ చేసినట్టు ఉంది అనుకుంటుంది.

Advertisement

ఇంతలో సుమిత్ర తన మనసులో మాట డైరెక్టుగా చెప్తాను అంటూ సూరజ్‌ గురించి గొప్పగా చెప్తూ.. జ్యోత్స్నతో పెళ్లి గురించి చెప్తుంది. ఆ మాటలకు జ్యోత్స్న కోపంగా ఆ అనాథ గాడిని నేను చేసుకోను అని రాత్రే గట్టిగా చెప్పాను కదా..? ఇంకా ఈ మీటింగ్‌ ఏంటి..? అంటూ తిడుతుంది. అప్పుడు సుమిత్ర, దీపను దగ్గరకు పిలిచి దీప జీవితం గురించి చెప్తుంది. అనాథగా పుట్టి అనాథగా పెరిగి ఇవాళ గొప్ప వ్యక్తిగా రూపుదిద్దుకుంది.. సూరజ్‌ కూడా దీప లాగే మంచి మనిషి తను అనాథ కాబట్టి దీపను వదిన అని పిలిచాడు. కార్తీక్‌ ను అన్నయ్యను చేసుకున్నాడు అని చెప్తుంటే.. జ్యో కోపంగా తనకు సూరజ్‌ వద్దని శివనారాయణ, దశరథలకు చెప్తుంది. కార్తీక్‌, దీపలు ఇద్దరూ కలిసి సూరజ్‌ గురించి శివనారాయణకు గొప్పగా చెప్తారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

Big Stories

Advertisement
×