E-Paper
Advertisement

గంటలో ఛార్జింగ్.. 187 కి.మీ రేంజ్.. అదిరిపోయే విడా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

గంటలో ఛార్జింగ్.. 187 కి.మీ రేంజ్.. అదిరిపోయే విడా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!
Advertisement

Hero Vida VX2 Plus Launched: ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు ఎక్కువ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, కొత్త ఫీచర్లతో సరికొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో విడా తన VX2 ప్లస్ స్కూటర్‌ కు కొత్త 4.4kWh బ్యాటరీ వేరియంట్ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.44 లక్షలు(ఎక్స్‌ షోరూమ్, న్యూఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.

పెద్ద బ్యాటరీతో అందుబాటులోకి..

ఈ కొత్త వేరియంట్‌లో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ సామర్థ్యం. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 3.4kWh వేరియంట్‌ తో పోలిస్తే, కొత్త మోడల్‌ లో పెద్ద బ్యాటరీని అందించడం వల్ల రేంజ్ కూడా భారీగా పెరిగింది. ఈ స్కూటర్‌ లో రెండు 2.2kWh రిమూవబుల్ బ్యాటరీలు ఉన్నాయి. మొత్తం బ్యాటరీ సామర్థ్యం 4.4kWh. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 187 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది పాత 3.4kWh వేరియంట్ ఇచ్చే 146 కిలోమీటర్ల రేంజ్‌తో పోలిస్తే చాలా ఎక్కువ.

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్..

Advertisement

ఛార్జింగ్ విషయంలో కూడా హీరో విడా కీలక మార్పులు చేసింది. ఈ స్కూటర్‌ తో 1kW పోర్టబుల్ ఛార్జర్ అందిస్తున్నారు. దీని ద్వారా బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు 3 గంటల 17 నిమిషాల్లో, పూర్తి ఛార్జ్ కావడానికి 5 గంటల 8 నిమిషాలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది. DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే 0 నుంచి 80 శాతం వరకు కేవలం 65 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. పూర్తి ఛార్జ్ కావడానికి దాదాపు 2 గంటల 30 నిమిషాలు మాత్రమే పడుతుంది.

పనితీరు గురించి..

పనితీరు పరంగా చూస్తే, హీరో విడా VX2 ప్లస్ లో 6kW ఎలక్ట్రిక్ మోటార్ తీసుకొచ్చింది. ఇది 26Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. నగర ప్రయాణాలతో పాటు హైవే ప్రయాణాలకు కూడా ఈ స్పీడ్ సరిపోతుంది. రైడర్ల అవసరాలకు అనుగుణంగా ఇందులో ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌ లను అందించారు. అంతేకాదు, ఓవర్‌ టేకింగ్ సమయంలో వేగాన్ని పెంచేందుకు బూస్ట్ మోడ్ కూడా ఉంది.

ఫీచర్ల గురించి..

Advertisement

హీరో విడా VX2 ప్లస్ లో 4.3 అంగుళాల TFT డిస్‌ ప్లే, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. దీంతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.  జూలై 2026 చివరి నాటికి ఈ కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానుంది.

Read Also: రివర్స్ కెమెరా To బ్లైండ్ స్పాట్ మానిటరింగ్.. ఇండియా లోనే మోస్ట్ అడ్వాన్స్ డ్ ఈవీ స్కూటర్ ఇదే!

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×