E-Paper
Advertisement

స్కూల్ బస్సులకు పసుపు రంగే ఎందుకు? దీని వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా?

స్కూల్ బస్సులకు పసుపు రంగే ఎందుకు? దీని వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా?
Advertisement

School Buses: స్కూల్ బస్సు అనగానే మన అందరికీ గుర్తొచ్చే మొదటి ముచ్చట.. ఆ బస్సు వెనుక పరిగెత్తే పిల్లలు, వాళ్ళని పట్టుకోవడానికి పరిగెత్తే తల్లులు! అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రపంచంలో కార్లు రంగురంగుల్లో ఉంటాయి, బైకులు రంగురంగుల్లో ఉంటాయి. కానీ స్కూల్ బస్సులు మాత్రం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా ఒకే రంగులో మెరిసిపోతుంటాయి. అదేనండీ.. మన ‘మంగళకరమైన’ పసుపు రంగు!

ట్రాఫిక్ సిగ్నల్‌లో డేంజర్ అని చెప్పడానికి ఎరుపు రంగు వాడతారు కదా, మరి అంతకంటే ముఖ్యమైన పిల్లల రక్షణ కోసం బస్సులకు ఎరుపు రంగు వేయకుండా పసుపు రంగు ఎందుకు వేస్తారో తెలుసా? దీని వెనుక పెద్ద సైన్స్, కాస్త హిస్టరీ కూడా ఉన్నాయి. అవేంటో సింపుల్‌గా చూసేద్దాం..

Advertisement

ఎరుపు కంటే పసుపే పవర్‌ఫుల్!

సాధారణంగా మనం ఎరుపు రంగు చాలా వేగంగా కంటికి కనిపిస్తుంది అనుకుంటాం. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే.. ఎరుపు రంగు కంటే పసుపు రంగును మన కళ్ళు 1.24 రెట్లు చాలా వేగంగా గుర్తుపట్టగలవు. మన కంటిలోని రెటీనాకు పసుపు రంగును క్యాచ్ చేసే సామర్థ్యం ఎక్కువ. ట్రాఫిక్‌లో వంద వాహనాలు ఉన్నా, మన కళ్ళు ముందుగా పసుపు రంగు వైపే వెళ్తాయి.

Advertisement

సైడ్ లుక్ (పెరిఫెరల్ విజన్) మ్యాజిక్

రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం కేవలం స్ట్రెయిట్‌గా మాత్రమే చూడము, పక్కన ఏం వస్తున్నాయో కూడా మనకు కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. దీన్నే ‘పెరిఫెరల్ విజన్’ అంటారు. మిగతా రంగులతో పోలిస్తే, పసుపు రంగు మనకు పక్క చూపుల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే, డ్రైవర్ నేరుగా ముందుకు చూస్తున్నా, పక్క నుంచి స్కూల్ బస్సు వస్తుంటే చటుక్కున గుర్తుపట్టేయగలడన్నమాట. దీనివల్ల ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.

చీకట్లోనైనా.. మంచులోనైనా..

పిల్లలు ఉదయాన్నే స్కూలుకు బయలుదేరుతారు. శీతాకాలంలో దట్టమైన పొగమంచు ఉంటుంది, కొన్నిసార్లు వర్షాల వల్ల వాతావరణం చీకటిగా మారుతుంది. ఇలాంటి తక్కువ వెలుతురు ఉన్న సమయాల్లో కూడా పసుపు రంగు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కాబట్టి, వెనుక వచ్చే వాహనదారులకు దూరం నుంచే స్కూల్ బస్సు వస్తోందనే విషయం అలర్ట్ ఇస్తుంది.

1939లోనే పడిన పునాది

ఈ పసుపు రంగు కథ ఈరోజుది కాదు. 1939లో అమెరికాలో శాస్త్రవేత్తలు, అధికారులు కలిసి పిల్లల భద్రత కోసం ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ రకరకాల రంగులను టెస్ట్ చేసి, చివరికి ఈ పసుపు రంగును ఫైనల్ చేశారు. దీన్ని అప్పట్లో ‘నేషనల్ స్కూల్ బస్ క్రోమ్’ అని పిలిచేవారు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఇదే రూల్‌ను ఫాలో అవుతున్నాయి.

కాబట్టి బాస్.. స్కూల్ బస్సుకు పసుపు రంగు వేయడం వెనుక ఉన్న అసలు రహస్యం అందం కోసం కాదు, మన ఇంటి పిల్లల భద్రత కోసం!

Related News

రాత్రికి రాత్రే 83 గ్రామాల ప్రజలు అదృశ్యం.. ఇంతకీ ఆ రోజు కుల్ధారాలో ఏం జరిగింది?

పై నుంచి చూస్తే దీన్ని అడవి అనుకుంటారు.. కానీ, అది అతి పెద్ద చెట్టు, ఎక్కడుందంటే?

రైల్వే స్టేషన్లలో కొత్త రూల్స్.. ఈ పనులు చేశారో జేబుకు చిల్లు తప్పదు!

ఏపీలో కొత్త హైస్పీడ్ కారిడార్.. అరకు నుంచి నూజివీడు వరకు మారనున్న రవాణా ముఖచిత్రం!

మంచు ఖండంలో భారత్ మరో రీసెర్చ్ సెంటర్.. ఇంతకీ మైత్రి-2తో కలిగే లాభం ఏంటి?

నేపాల్ విలయానికి చైనానే కారణమా? ముందే హెచ్చరిక ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదా?

మానస సరోవరానికి ఇండియా నుంచి ఎన్నో రూట్లు.. కానీ, నేపాల్ మీదుగానే ప్రయాణమెందుకు?

రైలులో ఊహించని సమస్య.. ఆ దంపతులకు రూ.75 వేలు చెల్లించిన రైల్వే, మీరూ ఇలా చేయండి

Big Stories

Advertisement
×