E-Paper
Advertisement

షాకింగ్ ఫీచర్.. ఐఫోన్‌కు పోటీగా మోటరోలా కొత్త ఫోన్.. బిల్ట్‌ఇన్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్‌తో ఎంట్రీ!

షాకింగ్ ఫీచర్.. ఐఫోన్‌కు పోటీగా మోటరోలా కొత్త ఫోన్.. బిల్ట్‌ఇన్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్‌తో ఎంట్రీ!
Advertisement

Motorola Edge 70 Max: భారతదేశంలోని మోటరోలా ఫ్యాన్స్ కోసం కంపెనీ అదిరిపోయే న్యూస్ చెప్పింది. తమ మోటో ఎడ్జ్ 70 సిరీస్‌లో ఐదో మోడల్‌గా ‘మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్’ను త్వరలో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. జులై 15 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇటీవల బడ్జెట్ రేంజ్‌లో జి77 పవర్‌ను తెచ్చిన మోటరోలా.. ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ సరికొత్త పవర్‌హౌస్‌ను పరిచయం చేస్తోంది.

ప్రత్యేక ఆకర్షణగా మ్యాగ్నెటిక్ ఛార్జింగ్:

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచరే. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇలాంటి ఛార్జింగ్ కావాలంటే విడిగా కేస్ లేదా రింగ్స్ వాడాల్సి వచ్చేది. కానీ, ఎడ్జ్ 70 మాక్స్ బాడీలోనే ఇన్-బిల్ట్‌గా ఈ మ్యాగ్నెట్స్ అమర్చారు. 25W వేగంతో పనిచేసే ఈ క్వి2.2.1 (Qi2) టెక్నాలజీతో ఎలాంటి అడాప్టర్లు లేకుండానే సులువుగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ సిరీస్‌లోని మిగతా నాలుగు ఫోన్లలో ఈ ఫీచర్ లేకపోవడం విశేషం.

దిమ్మతిరిగే పెర్ఫార్మెన్స్, సరికొత్త డిజైన్:

Advertisement

పనితీరు విషయంలో ఈ ఫోన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతోంది. దీనిలో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను వాడినట్లు మోటరోలా అధికారికంగా స్పష్టం చేసింది. ఇది ఫోన్ ఏఐ సామర్థ్యాన్ని, స్పీడ్‌ను విపరీతంగా పెంచుతుంది. ఇక డిజైన్ పరంగా చూసుకుంటే.. కర్వ్డ్ డిస్‌ప్లేలకు భిన్నంగా దీనికి ఫ్లాట్ స్క్రీన్, ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్, వెనుకవైపు స్క్వేర్ కెమెరా మాడ్యూల్‌తో క్లాసిక్ డిజైన్ ఇచ్చారు.

Also Read: ఇక గ్రామాల్లోనూ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. వైర్లు లేకుండానే 200 Mbps స్పీడ్, 5TB డేటాతో పాటు ఫ్రీ OTT!

అంచనా స్పెసిఫికేషన్లు ఇవే:

Advertisement

తాజా లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్ 6.82 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ స్క్రీన్, 144Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది. ఏకంగా 7,100mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఫోన్ వెనుకవైపు 50MP ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చని టాక్. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‌ను కూడా ఆశించవచ్చు.

ధర ఎంత ఉండొచ్చు?

ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన పేజీ లైవ్ అయింది. ధర వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ రేంజ్ ఫీచర్లు ఉన్న ఫోన్ ధర మార్కెట్లో సుమారు రూ.45,000 నుండి ర.50,000 మధ్య ఉండవచ్చని నిపుణుల అంచనా. ఈ ఫోన్ ముందుగా భారత్‌లోనే విడుదలవుతుండటం విశేషం.

Also Read: నో ఇంటర్నెట్.. నో సిగ్నల్.. అయినా Google Maps సూపర్‌గా పనిచేస్తుందిలా!

Related News

Airtel నుంచి మరో దుమ్మురేపే ప్లాన్.. ఇలాంటి బెనిఫిట్స్ కదా.. యూజర్లకు కావాల్సింది!

పోకీమాన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. గూగుల్ కొత్త ఫిట్‌బిట్ వచ్చేసిందోచ్!

ఇంట్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఎక్కువైతే.. Wi-Fi స్లో అవుతుందా? టెక్ నిపుణులు ఏమంటున్నారంటే..

రోబో వ్యాక్యూమ్‌తో భార్య ఎఫైర్ బట్టబయలు.. రూ.15 లక్షలు గెలిచి.. చివరికి జైలు పాలైన భర్త!

జురాసిక్ పార్క్ తరహాలో.. డైనోసార్లను తిరిగి సృష్టించొచ్చా? సైన్స్ ఏం చెబుతోంది!

Xiaomi 18 Fold లీక్.. అచ్చం ఐఫోన్ అల్ట్రాను తలపించే డిజైన్!

విడుదలకు ముందే హ్యాకర్ల చేతికి Ai+ Nova 2 Power 5G ఫోన్.. ఇదో కొత్త ప్రయోగం!

Realme C100i 4G లాంచ్.. రూ.14,999కే ఇన్ని ఫీచర్లా? పూర్తి వివరాలు మీ కోసం!

Big Stories

Advertisement
×