Spain Wildfire: స్పెయిన్ దేశంలో ప్రకృతి కన్నెర్ర జేసింది. దక్షిణ స్పెయిన్‌లోని ఆల్మేరియా ప్రావిన్స్ పరిధిలో గల లోస్ గల్లార్డోస్ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎగసిపడుతున్న మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న అడవులకు, నివాస ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ ఊహించని ధాటికి 12 మంది అక్కడికక్కడే అగ్నికి ఆహుతి కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం స్పెయిన్ దేశాన్ని వణికిస్తున్న రికార్డు స్థాయి అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు. ఎండల తీవ్రతకు తోడు బలమైన గాలులు తోడవడంతో మంటలు అదుపులేకుండా ఉవ్వెత్తున లేస్తున్నాయి. దట్టమైన పొగలు మైళ్ల దూరం వరకు కమ్మేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
అయితే, ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్పెయిన్ విపత్తు నిర్వహణ విభాగం, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు ప్రమాద ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారులను, రవాణా మార్గాలను అధికారులు తక్షణమే మూసివేశారు. ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది మంది నివాసితులను సహాయక బృందాలు అత్యంత వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
ప్రమాద తీవ్రత దృష్ట్యా రంగంలోకి దిగిన వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుండి నీటిని చల్లుతూ మంటలను అదుపు చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం, పొడి గాలుల వేగం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది.
Also Read: తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్!
🇪🇦🔥Incendio sin precedentes en el sur de España deja 12 muertos
‼️ Al menos 12 personas han muerto en un incendio forestal registrado este jueves en Los Gallardos, Almería
Algunas de las víctimas fueron halladas sin vida en el interior de vehículos alcanzados por las llamas pic.twitter.com/A0OkMHSKBk— Marian🇷🇺🇨🇳 (@marianpy1) July 10, 2026