Baba Vanga Predictions 2025 : పంచ గ్రహకూటమి. షష్ఠ గ్రహకూటమి. వరుసగా గ్రహాలు మారుతున్నాయి. వినాశకాలు, ఉత్పాతాలూ జరుగుతున్నాయి. షష్ట గ్రహకూటమి నాడే బ్యాంకాక్‌లో భూకంపం వచ్చింది. ఆ తర్వాత పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆపరేషన్ సిందూర్‌తో ఇండియా పాక్ యుద్ధం కూడా నడిచింది. పాకిస్తాన్‌లో ప్రతీ మూడు గంటలకో భూకంపం వస్తోందట. బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌తో తొక్కిసలాట. స్విట్జర్లాండ్‌లో మంచు కొండ కూలి ఏకంగా ఓ గ్రామమే గల్లంతైంది. ఇలా ప్రతీదానికీ గ్రహాల మార్పులే కారణమని చెబుతున్నారు జ్యోతిష్య ఎక్స్‌పర్ట్స్. ఈ ఏడాది అంతా ఇలానే ఉంటుందని.. ముందుముందు మరిన్ని ఉత్పాతాలు తప్పవని అంటున్నారు. భారతీయ పండితులే కాదు.. వరల్డ్ ఫేమస్ బాబా వంగా సైతం ఇలాంటి వార్నింగే ఇచ్చారు. డేట్‌తో సహా.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పేశారు.
జులై 5న ఏం జరగనుందంటే..
జులై 5న జపాన్‌లో భారీ విపత్తు సంభవించనుందని జపనీస్ కాలజ్ఞాని బాబా వంగా తెలిపారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య టెక్టాన్ ప్లేట్ విడిపోతుందని.. దాని కారణంగా భారీ సునామీ లేదా భూకంపం సంభవిస్తుందట. బాబా వంగా జోస్యం దెబ్బతో జపాన్‌కు పర్యాటకుల తాకిడి తగ్గింది. ఎంతలా అంటే ఆమె అంచనాల ఎఫెక్ట్‌తో జపాన్‌కు 83 శాతం విమాన బుకింగ్స్ తగ్గిపోయాయి. తూర్పు ఆసియా దేశాల నుంచి బుకింగ్స్ తగ్గిపోయినట్టు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
జపాన్‌కు వంగా దెబ్బ..
హాంకాంగ్ నుంచి జపాన్‌కు సగటు ఏడాదికి 50 శాతం బుకింగ్‌లు తగ్గాయి. జూన్- జూలై మధ్య కాలంలో బుకింగ్‌లు 83 శాతం వరకు తగ్గాయి. ఏప్రిల్-మే హాలీడేస్ సమయంలో 50 శాతం మేరకు బుకింగ్‌ల తగ్గుదల ఉందని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి
ఈసారి కూడా నిజమే అవుతుందా?
బాబా వంగా అంచనాలు గతంలో చెప్పింది చెప్పినట్టు నిజమయ్యాయి. 2011లో జపాన్‌లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీలపై ఆమె ముందుగానే జోస్యం చెప్పారు. ఆనాటి భూకంపంలో ఏకంగా 18వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లేటెస్ట్‌గా ఆమె జులై 5న మరో భారీ విపత్తు రానుందని, భూకంపం కానీ సునామీ కానీ తప్పదని హెచ్చరించడంతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ సైతం ఇటీవల జపాన్ పసిఫిక్ తీరంలో త్వరలో భారీ భూకంపం సంభవించనున్నదని, దాని కారణంగా 2 లక్షల 98 వేల మంది వరకు మరణించే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆ రెండూ మ్యాచ్ అవుతుండటంతో ఈసారి కూడా బాబా వంగా జోస్యం నిజమవుతుందని అంటున్నారు. జపాన్ అధికారులు మాత్రం ఇలాంటి ప్రిడిక్షన్స్ నమ్మవద్దని సూచిస్తున్నారు.