BigTV English

Ambani Family – IPL : ఐపీఎల్ లో ముంబై ఓనర్లకు సోఫాలు ఎందుకు వేస్తారు.. మిగతా ఓనర్లు జనాల మధ్యలో కూర్చుంటారు

Ambani Family – IPL : ఐపీఎల్ లో ముంబై ఓనర్లకు సోఫాలు ఎందుకు వేస్తారు.. మిగతా ఓనర్లు జనాల మధ్యలో కూర్చుంటారు

Ambani Family – IPL : సాధారణంగా క్రికెట్ లో ఐపీఎల్ కి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సీజన్ లో దాదాపు 18 సంవత్సరాల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలిచింది. ఐపీఎల్ సమయంలో నిత్యం క్రికెట్ గురించి ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంటుంది. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఐపీఎల్ లో ముంబై ఓనర్లకు సోఫాలు ఎందుకు వేస్తారు.. మిగతా ఓనర్లు జనాల మధ్యలో కూర్చొని మ్యాచ్ వీక్షిస్తుంటారు. ముంబై ఇండియన్స్ యజమానులు నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ లు డగౌట్ నుంచి కొద్ది అడుగుల దూరంలో తాళ్ల దగ్గర మెత్తటి సోఫాలపై హాయిగా కూర్చున్నారు.  అసలు వీరికే ఎందుకు సోఫాలు వేస్తారు. మిగతా ఓనర్ల కి ఎందుకు వేయరు..? అనే ప్రశ్నలు చాలా మందికి తలెత్తడం విశేషం.


Also Read : Vaibhav Suryavanshi : డ్రైవింగ్ లైసెన్స్ లేదు కానీ… కారు మాత్రం వచ్చేసింది.. 14 ఏళ్ల వైభవ్ పై ట్రోలింగ్

వాస్తవానికి నీతా అంబానీ అసలు టీమ్ ఓనరే కాదు.. ఒక రకంగా చెప్పాలంటే ఆమె టీమ్ కి సీఈఓ అని చెప్పవచ్చు. టీమ్ మీటింగ్స్, స్టాటజీ మీటింగ్, ప్లేయర్ మీటింగ్ లకి తరచూ హాజరవుతూ ఉంటారు. టీమ్ తో మంచి బంధం ఉన్న వ్యక్తి టీమ్ దగ్గరే ఉంటారు. కేవలం ముంబై కే కాదు.. ఐపీఎల్ లో వేరే టీమ్ కి కూడా స్పాన్సర్ చేస్తుంటారు. అందుకే వాళ్లకి ఇలాంటి అరెంజ్ మెంట్స్ మామూలే. మెయిన్ రీజన్ డబ్బు.. డబ్బుతో దేనినైనా కొనవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. వాస్తవానికి ఐపీఎల్ టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచింది. ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్ లు జరిగినప్పుడల్లా ప్లస్ బ్లూ సోఫా ప్రత్యేకంగా మైదానంలో ఉంచబడుతోంది.   జూన్ 01 వరకు  వాస్తవానికి ఈ విషయం పై ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ పంజాబ్ కింగ్స్ చేతిలో క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ యజమాని ప్రీతి జింటా వీఐపీ గ్యాలరీలో మ్యాచ్ ని చూస్తున్నట్టు అభిమానులు గమనించారు. నీతా అంబానీ, తన కుమారుడు మాత్రం బ్లూ కలర్ సోఫాలో డగౌట్ కి చాలా దగ్గరగా కూర్చొని మ్యాచ్ ని వీక్షించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రోలింగ్స్ చేస్తున్నారు. ముంబైజట్టుఆడేప్రతీ స్టేడియంలో బ్లూ కలర్ సోఫాను ఏర్పాటు చేసే ఈ ప్రాధాన్యతను బీసీసీఐ ఎందుకు పాటించిందని కొందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇతర జట్ల యజమానులు మాత్రం వీఐపీ బాక్స్, కార్పొరేట్ బాక్సుల్లో కూర్చొవడం లేదా నిలబడి మ్యాచ్ ని వీక్షిస్తుంటారు. కానీ ముంబై ఇండియన్స్ యజమానులు రాయల్ గా గ్రౌండ్ పక్కనే కూర్చొని మ్యాచ్ వీక్షిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తెగల వైరల్ అవుతోంది.

?igsh=MWUwYXlvYXAyeGJ0OA==

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×