Naga Vamsi: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో బయటకు గట్టిగా వినిపించే పేరు నాగ వంశీ. ఒకప్పుడు దిల్ రాజు పేరు ఎలా వినిపించేది నాగ వంశీ పేరు కూడా ఈ మధ్య కాలంలో అలా వినిపించింది. అయితే వార్ 2 సినిమా ఫలితం నాగవంశీని కంప్లీట్ గా సైలెంట్ చేసేసింది. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నాడు వంశీ. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. తీవ్రమైన నష్టాలను తీసుకొచ్చింది.
ఆ సినిమా ఫెయిల్ అయిపోయిన తర్వాత నాగ వంశీని విపరీతంగా చాలామంది ట్రోల్ చేశారు. కొంతమంది నాగ వంశీ పై ప్రత్యేకమైన కథనాలను ప్రచురించారు. ఆస్తులు అమ్ముకొని దుబాయ్ వెళ్లిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే దాని గురించి నాగ వంశీ కూడా మాస్ జాతర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో స్పందించాడు. నాకు ఆ లాజిక్ అర్థం కాలేదు అంటూ నవ్వుకున్నాడు. మాస్ జాతర సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో రవితేజ నాగ వంశీ పాల్గొన్న ఇంటర్వ్యూ విడుదలైంది.
నాగ వంశీ దుల్కర్ సల్మాన్ నిర్మించిన కొత్తలోక అనే సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేశాడు. వార్ సినిమా తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయింది అద్భుతమైన కలెక్షన్స్ కూడా తీసుకువచ్చింది.
ఈ సినిమా పైన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వంశీ. వంశీ మాట్లాడుతూ.. ఈ మాట చెప్తే నన్ను మళ్లీ పచ్చి బూతులు తిడతారు. లోక సినిమా నేనే తెలుగులో రిలీజ్ చేశా. అదే సినిమాను నేను స్ట్రైట్ తెలుగు ఫిలిం లాగా చేస్తే… ఇది లాగ్ ఉంది, ఇది స్పాన్ లేదు. ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే, నా పేరు మార్చుకుంటా. సినిమా నేను తెలుగులో డైరెక్ట్ గా చేసి ఉంటే మాత్రం ఎవడు చూసే వాడు కాదు. అని నాగ వంశీ చెప్పారు.
జనాలకు నిజంగా ఎప్పుడు ఏది నచ్చుతుందో ఎవరికి తెలియదు. మన తెలుగు ఆడియన్స్ లిటిల్ హార్ట్స్ సినిమాను హిట్ చేశారు. కుర్రాళ్ళు ఎవరో తెలియదు. డైరెక్టర్ ఎవడో తెలియదు. ఏమీ తెలియదు. ఈటీవీ విన్, రామోజీరావు గారి పేరు తప్ప.
ముందు రోజు ప్రీమియర్ చేస్తే చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయ్యాయి. ఆ రోజు రిలీజ్ అయిన రెండు మూడు సినిమాల కంటే కూడా ఈ సినిమా బెటర్ పర్ఫామెన్స్ చేసింది. అంటే తెలుగు సినిమా ఆడియన్స్ వాళ్లు ఆల్రెడీ ఏం చూడాలో ఫిక్స్ అయి ఉన్నారు. అలా ఫిక్స్ అయితే సినిమాను ఎలా అయినా చూస్తున్నారు.
Also Read: Dil Raju: దిల్ రాజుకి ఫెయిల్యూర్స్ నేర్పిన గుణపాఠం, అందుకే ఈ హితబోధ