BigTV English

Renu Desai: మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేణు దేశాయ్.. మొదట సారి ఆ పాత్రలో?

Renu Desai: మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేణు దేశాయ్.. మొదట సారి ఆ పాత్రలో?
Advertisement

Renu Desai: రేణు దేశాయ్(Renudesai) ఇండస్ట్రీకి బద్రి సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు .మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం జానీ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత రేణు దేశాయ్ పెద్దగా సినిమాలలో కనిపించలేదు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె తన పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కూడా రేణు దేశాయ్ సినిమాలలో కనిపించలేదు.


మరో సినిమాకు కమిట్ అయిన రేణు దేశాయ్..

ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పిల్లల బాధ్యతలను చూసుకున్న ఈమె చాలా సంవత్సరాల తర్వాత రవితేజ (Raviteja)హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswarrao) అనే సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్ నటించిన పెద్దగా పేరు రాలేదని చెప్పాలి. ఈ సినిమా తర్వాత రేణు దేశాయ్ తిరిగి వరస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారని అందరూ భావించారు కానీ, ఈమె తదుపరి ఎలాంటి సినిమాలకు కమిట్ కాకపోవడంతో అభిమానులు కూడా ఆశలు వదులుకున్నారు. ఇలాంటి తరుణంలోనే అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు.

అత్త పాత్రలో రేణు దేశాయ్..

రేణు దేశాయ్ మరో సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తోంది .ఈసారి కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో రేణు దేశాయ్ నటించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఈమె హీరోయిన్ కు అత్త పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇలా మొదటిసారి అత్త(Mother In law) పాత్ర ద్వారా రేణు దేశాయ్ ఒక కామెడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. రేణు దేశాయ్ అత్త పాత్రలో నటించడం ఏంటి అది కూడా హీరోయిన్ కి అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో హీరో ఎవరు? ఏంటీ? అనే విషయాలు త్వరలోనే వెల్లడించునున్నారు.


జంతు సంరక్షణ..

టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత మరోసారి రేణు దేశాయ్ వెండి తెరపై కనిపించబోతున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాలకు రేణు దేశాయ్ కాస్త దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు ఇటీవల రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నాను అంటూ రేణు దేశాయ్ వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తాను సన్యాసం లోకి వెళ్ళబోతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈమె వార్తల్లో నిలిచారు. ఇలా సోషల్ వర్క్ చేస్తూ, జంతువులను సంరక్షిస్తూ నిత్యం వాటికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

Also Read: Bigg Boss 9 Telugu : తెలుగు బిగ్ బాస్ బ్యాన్… నాగార్జునకు ఏం అయింది ?

Related News

Srinu vaitla: కిరణ్ ను చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొస్తున్నాడు!

Kiran Abbavaram : కె ర్యాంప్ క్రెడిట్ అంతా నాకే… వాళ్లకు ఏం సంబంధం లేదు

Naga Vamsi: ఆ సినిమా నేను తెలుగులో తీసుకుంటే పచ్చి బూతులు తిట్టేవాళ్ళు

Dil Raju: దిల్ రాజుకి ఫెయిల్యూర్స్ నేర్పిన గుణపాఠం, అందుకే ఈ హితబోధ

Sujeeth: ఓజీ సీక్వెల్‌ను పక్కన పెట్టి.. బాలీవుడ్ బాట తొక్కుతున్న డైరెక్టర్ సుజీత్

SKN: అప్పుడు అల్లు అర్జున్..ఇప్పుడు కిరణ్ అబ్బవరం..  పొగడ్తలతో ముంచేత్తిన నిర్మాత!

Ravi Teja-Surender Reddy: హ్యాట్రిక్ కాంబో సెట్… మరి ఇప్పుడైనా ఫ్యాన్స్‌కు ‘కిక్’ ఇస్తారా ?

Big Stories

×