ప్రస్తావన
1940 తెలంగాణ ప్రాంతం లో పంట పాండిచేది రైతే కానీ పంట మీద హక్కు మాత్రం జమిందారిదే. బానిసత్వం, బికారితనం, అన్యాయం ఇలా అన్ని భరించిన ఒక రైతు, ఇక చాలు అని ఒక అగ్నిరవ్వ లా వెలిగి అతని చుట్టూ ఉన్న వారిలో స్ఫూర్తి నింపిన నిప్పు రవ్వ దొడ్డి కొమరయ్య…
Also Read: Bigg Boss 9 Telugu : తెలుగు బిగ్ బాస్ బ్యాన్… నాగార్జునకు ఏం అయింది ?
నిజాం పాలనా లో నిప్పు రవ్వ
తెలంగాణ గ్రామాల్లో రైతు ఎంత పండించిన ఏది పండించిన, ఆ ధాన్యం అంత భూస్వామి గోకాలకే పోతుంది. వాటి మీద పన్నులు వేసి దోచుకునే వారు. ఎంత వెట్టి చాకిరీ చేసిన రైతు కి కష్టాలు తప్పేవి కాదు.
వాటికి తోడు రాత్రి వెళ్లాలో రజాకార్ల అరుపులు. ఈ అష్ట కష్టాల నడుమ వెలిగిన ఒక నిప్పు రువ్వే దొడ్డి కొమరయ్య.
తెలంగాణ సాయుధ పోరాటం ఎలా మొదలయింది?
రైతు ఆవేదన చివరకు గట్టి సంకల్పంగా మారింది, కమ్యూనిస్ట్ నాయకత్వం గ్రామాల్లో చిగురు పూసింది, అది నిదానంగా “భూమి , పంట పండించిన వాడిదే” అనే స్లోగన్ గా మారింది. ఈ ఉద్యమం రజకార్ల మీద భూస్వాముల అణిచి వేయటం కొరకు ఇక మాటలు చాలు అని ఆయుధాలు చేత పట్టారు ఉద్యమకారులు.
నాయకత్వ బాధ్యత
సాధారణ రైతు నుంచి అసాధారణ ఉద్యమకారుడిగా.. నాయకుడిగా మారారు దొడ్డి కొమరయ్య. ఈయన దగ్గర నాయకుడి లక్షణాలే కావు.. పెద్దగా ధనము కూడా లేదు. కానీ, అన్యాయంలో నుంచి పుట్టుకొచ్చిన గట్టి సంకల్పం మాత్రమే ఉంది. ఆ సంకల్పమే అతని గొంతు బలంగా మారి రైతు గుండెలో ధైర్యాన్ని నింపింది.
అమరత్వానికి దారి తీసిన రోజు
జులై 4, 1946. ఆ రోజు సాయంత్రం రైతుల సమావేశం జరుగుతుంది, అక్కడి రజాకార్లు ఆయుధాలతో గుముగూడారు. కాల్పులు జరిగాయి, రైతుల ఎదుట నిలిచినా దొడ్డి కొమరయ్య కాల్పుల్లో రక్తపు ముద్దా లో మునిగి తేలాడు. ప్రాణం పోయిన గొంతు గాలం మాత్రం ఆగిపోలేదు….
ఆ గాలం ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగు గా మనం గుర్తు పెట్టుకోవాలి.
మరణం తరువాత
దొడ్డి కొమరయ్య మరణం తరువాత తెలంగాణ ఉద్యమం మరింత బలం పుంజుకుంది. తరువాత వచ్చిన నాయకులూ అందరు కొమరయ్యని స్ఫూర్తి గా తీసుకొని ఉద్యమం ముందుకు నడిపారు.