Kiran Abbavaram: సినీ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం రహస్య(Rahasya) హీరో హీరోయిన్లుగా “రాజా గారు రాణివారు” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కిరణ్ అబ్బవరం మాత్రం తదుపరి పలు సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.
ఇలా కిరణ్ అబ్బవరం హీరోగా ఎస్ఆర్ కళ్యాణ మండపం, మీటర్, వినరో భాగ్యము విష్ణు కథ, సమ్మతమే వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలేవి కూడా అనుకున్న విధంగా సక్సెస్ అందించలేకపోయాయి. ఇకపోతే గత ఏడాది కిరణ్ అబ్బవరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “క” సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు స్వయంగా కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అలాగే ఈ ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకొని కేర్యాంప్(K Ramp) సినిమాతో మరోసారి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు అందుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా కే ర్యాంప్ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో అబ్బవరం మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. కే ర్యాంప్ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నప్పటికీ ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. ఈ విషయం గురించి కిరణ్ అబ్బవరం మాట్లాడారు. ఉదయం లేసేటప్పటికీ ఈ సినిమా గురించి డిజాస్టర్ టాక్ ఉంది. ఈ సినిమా గురించి వినగానే నాకు ఎస్ఆర్ కళ్యాణ మండపం గుర్తుకు వచ్చిందని తెలిపారు.
మొదటి హీరోయిన్ తో పెళ్లి..
ఈ సినిమాపై నమ్మకంతో థియేటర్లకు వెళ్లాలని అక్కడ ఊహించని ఆదరణ లభించిందని ఈ సినిమాని ఇంత మంచి విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఈ సినిమా థాంక్స్ మీట్ లో భాగంగా పెళ్లి తర్వాత బాగా కలిసి వచ్చినట్టుంది అంటూ రిపోర్టర్ ప్రశ్నించడంతో వెంటనే కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ దయచేసి ఈ సినిమా క్రెడిట్ మొత్తం నాకు ఇవ్వండి. నా భార్యకు, నా కొడుకుకు ఇవ్వకండి వారికి ఈ సినిమాకు ఏం సంబంధం లేదు. ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని తెలిపారు. కిరణ్ అబ్బవరం తన మొదటి హీరోయిన్ రహస్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక అబ్బాయి జన్మించారు. తనకు హను అబ్బవరం (Hanu Abbavaram) అనే నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం వరుస సక్సెస్ సినిమాలను అందుకోవటం విశేషం.
Also Read: Sujeeth: ఓజీ సీక్వెల్‌ను పక్కన పెట్టి.. బాలీవుడ్ బాట తొక్కుతున్న డైరెక్టర్ సుజీత్