Srinu vaitla: ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) గత ఏడాది ‘క’ అనే సినిమాతో ఇదే దీపావళికి వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మళ్లీ దీపావళి జోష్ తో కే ర్యాంప్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో బాగానే దూసుకుపోతోంది. యువతకు కావలసిన లవ్, రొమాంటిక్ ట్రాక్ తో పాటూ మాస్ ఎలిమెంట్స్, అలాగే ఫ్యామిలీతో చూడదగ్గ కామెడీ సన్నివేశాలు.. పండుగ మూడ్ లో ఇవన్నీ కలిసి ఈ సినిమాను పర్ఫెక్ట్ దీపావళి ఎంటర్టైనర్ గా నిలబెట్టాయి.
ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల (Srinu vaitla) కిరణ్ అబ్బవరాన్ని చూస్తుంటే.. ఆ స్టార్ హీరో గుర్తుకు వస్తున్నాడు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. కే ర్యాంప్ సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. “కే ర్యాంప్ ఒక్క నిమిషం కూడా ఎక్కడా బోర్ కొట్టలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు ఇలాంటి కథలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు మొదట నమ్మకం కలగాలి. ఈ సినిమాలో కిరణ్ ని చూసి నేను ఎంతో సంతోషం గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కిరణ్ ని చూస్తుంటే ఒకప్పటి నాకు దుబాయ్ శీను, వెంకీ సినిమాలలో రవితేజను చూసినట్లు అనిపిస్తోంది” అంటూ శ్రీనువైట్ల తెలిపారు.. మొత్తానికైతే మాస్ మహారాజా రవితేజ తో కిరణ్ ను పోల్చేసరికి కిరణ్ అబ్బవరం అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబతున్నారు.
also read:Bigg Boss 9 Promo: ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ కాదు.. ప్రాణాల మీదకు తెచ్చేలా ఉన్నారే!
కే ర్యాంప్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కృష్ణ (సాయికుమార్) రిచ్ బిజినెస్ మాన్ గా వ్యవహరించారు. ఆయన కుమారుడే కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) . తండ్రి బిజినెస్ మాన్ అయినా కొడుకు మాత్రం అల్లరిగా తిరుగుతూ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఒక్కగానొక్క కొడుకు కుమార్ ను అల్లారుముద్దుగా పెంచుతాడు తండ్రి కృష్ణ. అయితే కొడుకు అల్లరిని తగ్గించడం కోసం కేరళలోని ఒక కాలేజీలో డొనేషన్ సీట్ కొని పై చదువుల కోసం అక్కడికి పంపిస్తాడు. కాలేజ్లో చేరిన కుమార్ కి మెర్సీ (యుక్తి తరేజ) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత మెర్సీకి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజాస్టర్ (PSTD) అనే మానసిక వ్యాధి ఉందని కుమార్ కి తెలుస్తుంది. అయితే ఈమెకు ఉన్న ఈ వ్యాధి కుమార్ ప్రాణాల మీదకు తెస్తుంది. మెర్సీకి ఉన్న ఈ వ్యాధి వల్ల కుమార్ కి వచ్చిన కష్టం ఏంటి? దీని నుంచి కుమార్ ఎలా బయటపడ్డాడు? చివరికి మెర్సీకి ఈ వ్యాధి నయమవుతుందా? కుమార్ – మెర్సీ ప్రేమ కథకు ముగింపు ఏంటిm అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.