Dil Raju: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు. ఈ బ్యానర్ ద్వారా చాలామంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇదే బ్యానర్ లో పరిచయమైన సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్స్ లో ఒకరు. ఏకంగా నేషనల్ అవార్డు కూడా తీసుకురాగలగే సత్తా ఉన్న దర్శకుడు సుకుమార్.
కేవలం సుకుమార్ మాత్రమే కాకుండా బోయపాటి శ్రీను, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు భాస్కర్, వేణు శ్రీరామ్ వంటి ఎంతోమంది దర్శకులు ఈ బ్యానర్ వలన పరిచయం అయ్యారు. ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అని అందరికీ ఒక స్థాయి నమ్మకం ఉండేది. రీసెంట్ టైమ్స్ లో ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలేవి కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదు.
నిర్మాతగా దిల్ రాజు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించినప్పుడు దాని వలన వచ్చే నష్టాలను కూడా ఎదుర్కొన్నారు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన గేమ్ చేంజర్ అనే సినిమా ఊహించని నిరాశను మిగిల్చింది. శంకర్ లాంటి దర్శకుడు తో దిల్ రాజు ప్రాజెక్ట్ సెట్ చేశారు అన్నప్పుడు అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి. సినిమా ఫలితం చూస్తే తేలిపోయింది.
ఒకప్పుడు దర్శకులు ను పరిచయం చేస్తూ మంచి కథలను జడ్జ్ చేస్తూ, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నారు దిల్ రాజు. బలగం సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక కొత్త దర్శకుడు కూడా ఆ బ్యానర్ నుంచి బయటకు రాలేదు. ఆల్రెడీ చేసిన దర్శకులతో పనిచేయటం వలన, ఆ దర్శకులకి సినిమా మీద అవగాహన ఉంది కాబట్టి అనే ఉద్దేశంతోనూ, ఇంకోలాను దిల్ రాజు పెద్దగా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం అనేది కూడా కొంతమేరకు ఫెయిల్యూర్స్ కి దారితీసింది అని చెప్పాలి.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాజేష్ దండ అనే కొత్త నిర్మాత వచ్చి సూపర్ హిట్ సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా K -Ramp సినిమాతో ఈ నిర్మాత మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సక్సెస్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ…
సక్సెస్ తో మనకు అన్ని వస్తాయి. కానీ మనం అది వదిలేస్తాం. మొదటి సినిమా మీకు ఏమైతే ఇచ్చిందో దానిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే సక్సెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మార్పు ఎప్పుడైతే తీసుకుంటామో ప్రాబ్లం కూడా అక్కడే మొదలవుతుంది. సక్సెస్ వదిలేసి ఫెయిల్యూర్స్ రావటం మొదలవుతాయి అని దిల్ రాజు తన స్పీచ్ లో చెప్పారు.
దిల్ రాజు మాటలు వింటుంటే తన సక్సెస్ ఫార్ములాను వదిలేసి, భారీ బడ్జెట్ సినిమాలు, ఆల్రెడీ గుర్తింపు ఉన్న దర్శకులతో పనిచేయడం వల్లనే ఫెయిల్యూర్స్ రావడం మొదలయ్యాయి అనే ఆలోచన రాకమానదు.
Also Read: NTR: ఊసరవెల్లి లాంటి సినిమా తీద్దాం, ఇదెక్కడి డెసిషన్ తారక్?