BigTV English
Advertisement

MTS notification: 1075 ఉద్యోగాలకు అప్లై చేశారా..? రేపే లాస్ట్ డేట్ భయ్యా..

MTS notification: 1075 ఉద్యోగాలకు అప్లై చేశారా..? రేపే లాస్ట్ డేట్ భయ్యా..

MTS notification: పదో తరగతి పాసైన నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగాలు, పోస్టుల వివరాలు, విద్యార్హత, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, తదితర వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


నోట్: రేపే లాస్ట్ డేట్.. (అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి..)

భారత ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025 సంవత్సరానికి ఎంటీఎస్‌ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – నాన్ టెక్నికల్), హవాల్దార్ (CBIC & CBN) పోస్టుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 26 నుంచి జులై 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1075

ఇందులో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు- వివరాలు:

ఎంటీఎస్: 1075 పోస్టులు

విద్యార్హత: టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 26

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 24

ఫీజు చెల్లింపుకు చివరి తేది: 2025 జులై 25

దరఖాస్తుకు సవరణ: 2025 జులై 29 నుంచి 2025 జులై 31 వరకు

కంప్యూటర్ బేస్ట్ టెస్ట్: సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు ఉంటుంది.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.18వేల నుంచి రూ.56,900 వేతనం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్ సైట్ లేదా mySSC మొబైల్ యాప్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ డ్ ఎగ్జామ్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. రెండు సెషన్లు నిర్వహిస్తారు. సెషన్-2 లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ నెగిటివ్ ఉంటుంది.

శారీరక పరీక్షలు: 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో నడవాల్సి ఉంటుంది. మహిళలు అయితే కిలోమీటర్ దూరాన్ని 20 నిమిషాల్లో నడవాలి. హైట్, వెయిట్, ఛాతీ కొలతలు ప్రామాణిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా.. అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.gov.in/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1075

దరఖాస్తుకు చివరి తేది: జులై 24

ALSO READ: ICF Notification: ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 1010 ఉద్యోగాలు.. వారికైతే నో అప్లికేషన్ ఫీజు.. అప్లై చేస్తే నౌకరీ

Related News

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

BSF Jobs: బీఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, భారీ శాలరీ

RRC NWR: రైల్వేలో 2162 ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు రూ.100 మాత్రమే.. ఇంకా ఒక్క రోజే గడువు

Govt Medical College: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.1,90,000.. అర్హత ఇదే..

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

CBSE Final Date Sheets: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. 10, 12వ తరగతుల తుది డేట్ షీట్స్ వచ్చేశాయ్

NHAI Recruitment: డిగ్రీ అర్హతతో నేషనల్ హైవేలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,77,500 జీతం, ఇదే మంచి అవకాశం

Territorial Army: ఆర్మీలో 1426 సోల్జర్ ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు, అద్భుతమైన అవకాశం డోంట్ మిస్

Big Stories

×