Brahmamudi serial today Episode: అప్పు, కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి అప్పు ఓదారుస్తాడు. ఇంతలో డాక్టర్ ఫోన్ చేస్తుంది. అప్పు ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తుంది. దీంతో కళ్యాణ్ ఎవరు పొట్టి ఫోన్ అని అడగ్గానే.. ఇంకెవరు డాక్టర్ గారే చేస్తున్నారు అని చెప్తుంది. మరి లిఫ్ట్ చేసి మాట్లాడకుండా అలా పక్కన పెట్టేశావేంటి..? అంటాడు. పక్కన పెట్టకుండా మరేం చేయమంటావు లిఫ్ట్ చేస్తే అక్కకు ఈ విషయం చెప్పారా లేదా అని అడుగుతారు. అప్పుడే సమాధానం చెప్పాలి.. లేదా ఇంకెప్పటికి చెప్పలేను అని చెప్పాలా..? ఏం చెప్పను కూచి నువ్వే చెప్పు.. అంటుంది.
దీంతో ఏదో ఒకటి చెప్పు పొట్టి లేదంటే ఈ సారి నీకు వచ్చిన ఫోన్ కాల్ వదినకు వెళ్తుంది. మనం చెప్పకపోతే ఆవిడ చెప్తుంది. అప్పుడు ఇంకా ప్రమాదం పొట్టి.. అందుకే చెప్తున్నాను. లిఫ్ట్ చేసి ఏదో ఒకటి మాట్లాడు అంటాడు కళ్యాణ్. అప్పు కాల్ లిఫ్ట్ చేస్తుంది. కావ్యకు విషయం చెప్పావా అని డాక్టర్ అడగ్గానే.. చెప్పలేదని అప్పు అంటుంది. దీంతో డాక్టర్ కోపంగా ఎందుకు చెప్పలేదు.. లేటు అయ్యేకొద్ది మీకే ప్రమాదం.. మీ మంచి కోరి చెప్పాను.. అయినా మీరు ఇలాగే ఉంటానంటే మీ ఇష్టం అంటూ కాల్ కట్ చేస్తుంది డాక్టర్. దీంతో అప్పు, కళ్యాణ్ ఇద్దరూ బాధపడుతుంటారు.
హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. రేవతి అందరికీ స్వీట్లు పంచుతుంది. దీంతో ఇంద్రాదేవి.. చూశారా..? రేవతి ఇంటికి రాగానే ఇల్లంతా ఎంత సందడిగా మారిపోయిందో.. అందుకే అంటారు.. ఆడపిల్లంటే లక్ష్మీదేవి అని ఎవరేమన్నా కూడా ఆడపిల్ల ఉంటే ఇంట్లో ఆ కలే వేరు ఆడపిల్ల ఆడపిల్లే అంటుంది. ఇంతలో రేవతి స్వీట్లు తీసుకెళ్లి రుద్రాణికి ఇస్తూ తీసుకో అత్తయ్యా అంటుంది. రుద్రాణి థాంక్స్ చెప్తుంది. దీంతో ఇద్రాదేవి.. ఏంటి రుద్రాణి థాంక్సా..? మనఃస్పూర్తిగా చెప్తున్నావా..? లేక చెప్పాలి కాబట్టి మొహమాటానికి చెప్తున్నావా..? అని అడగ్గానే.. ఏంటమ్మా మొహమాటానికి ఎందుకు చెప్తాను అంటుంది రుద్రాణి.. ఎందుకంటే తమరికి ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే నచ్చదు కద అత్త. అందులోనూ రేవతి ఇంటికి రావడం అసలు ఇష్టం ఉండదు కదా..? అంటుంది స్వప్న.
దీంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావే రేవతి రావడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే మీ అందరికంటే నాకే ఎక్కువ సంతోషంగా ఉంది అంటుంది రుద్రాణి. దీంతో అందరూ రుద్రాణి మీద సెటైర్లు వేస్తుంటారు. హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో కావ్యకు నిజం చెప్పడానికి రూంలోంచి బయటకు వస్తారు అప్పు, కళ్యాన్. కానీ చెప్పకుండా ఆగిపోతారు. ఏంటి కూచి అక్కకు నిజం చెప్తానని వచ్చి ఇక్కడే ఆగిపోయావేంటి..? అని అప్పు అడుగుతుంది. అక్కడికి వెళ్లలేక ఆగిపోయాను పొట్టి.. పుట్టబోయే బిడ్డ గురించి అన్నయ్య కూడా చాలా ఆశలు పెంచుకుంటున్నాడు. అంత సంతోషంగా ఉన్న వాళ్ల దగ్గరకు వెళ్లి ఈ చేదు నిజాన్ని చెప్పలేకే ఆగిపోయాను. నా వల్ల కాదు కావడం లేదు పొట్టి.. ఏదో విధంగా నువ్వే చెప్పు పొట్టి.. లేదంటే అన్నయ్య వాళ్లు ఆ బిడ్డ మీద చాలా ఆశలు పెంచుకుంటారు అని కళ్యాణ్ చెప్పగానే.. లేదు కూచి నేను ఒక్కదాన్నే వెళ్లి చెప్పలేను.. నాకు తోడుగా నువ్వు కూడా రా అంటుంది అప్పు.
ఇద్దరూ కలిసి హాల్లోకి వెళ్తారు. వాళ్లను చూసిన కావ్య అదిగో అప్పు వాళ్లు కూడా వచ్చారు.. అప్పు నువ్వైనా చెప్పు అప్పు.. మీ బావ గారు నాకు కచ్చితంగా ఆడపిల్లే పుడుతుందని చాలెంజ్ చేస్తున్నారు. తనని మహరాణిలా ప్రిన్స్ డయానాలా చూసుకుంటానని ఓ పెద్ద గొప్పలు చెప్తున్నారు.. నాకు ఎవరు పుడతారు నువ్వు చెప్పు అప్పు.. నాకు ఎవరు పుడతారు.. అంటూ అడుగుతుంటే.. అప్పు ఏడుస్తూ.. నీకు అసలు ఎవరూ పుట్టరు అక్క అంటుంది. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు.. ఏంటి అప్పు ఏం మాట్లాడుతున్నావు.. అసలు ఎవరు పుట్టకపోవడం ఏంటి..? అంటూ రాజ్ అడగ్గానే.. అవును అప్పు ఆల్ రెడీ నా కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా..? అంటుంది కావ్య. కానీ నీకు ఆ బిడ్డ పుట్టదు అక్క.. ఆ బిడ్డ పుడితే నువ్వు చనిపోతావు. అందుకే వీలైనంత త్వరగా ఆ బిడ్డను తీసేయాలని డాక్టర్ చెప్పారు అక్క.. అనగానే.. అంటే నా బిడ్డను పురిటిలోనే చంపేయాలంటావా..? అంటుంది కావ్య. దీంతో అప్పు తప్పదు అక్కా నువ్వు బతకాలంటే బిడ్డను వదులకోక తప్పదు.. లేదంటే ఇద్దరూ చనిపోతారట.. అంటూ అప్పు చెప్పగానే.. లేదు నా బిడ్డను వదులుకోను నా ప్రాణం పోయినా వదులుకోను అంటూ కావ్య స్పృహ తప్పి కిందపడిపోతుంది.
అదంతా కళ గంటుంది అప్పు.. కావ్య.. అప్పు అంటూ గట్టిగా పిలవగానే.. అప్పు ఏడుస్తూ.. అక్కా అంటూ కావ్యను హగ్ చేసుకుంటుంది. కావ్యకు నిజం చెప్పకుండా రూంలోకి వెళ్లి బాధపడుతుంది అప్పు.. కళ్యాన్ వచ్చి నిజం వదినకు చెప్పకుండా అన్నయ్యకు చెబుదామని అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.