State Bank of India: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ లేదా ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/ఎంఎంఎస్/సీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ముంబయి రెగ్యులర్ విదానంలో ఖాళీగా ఉన్న 122 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.
ALSO READ: Constable Jobs: పదితో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 81,000 జీతం.. డోంట్ మిస్
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 122
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు..
మేనేజర్(క్రెడిట్ అనలిస్ట్): 63
మేనేజర్(ప్రొడక్ట్స్-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్): 34
డిప్యూటీ మేనేజర్ (ప్రొడక్ట్స్-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్): 25
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/ఎంఎంఎస్/సీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ, బీఈ/బీటెక్ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ముఖ్యమైన డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 11
దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 2
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. మేనేజర్‌కు 28 – 35 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 25 – 32 ఏళ్లు, మేనేజర్(క్రెడిట్ అనలిస్ట్)కు 25 – 35 ఏళ్ల వయస్సు ఉండాలి.
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు మేనేజర్‌కు రూ.85,920 – రూ.1,05,280, డిప్యూటీ మేనేజర్‌కు రూ.64,820 – రూ.93,960 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.