BigTV English
Advertisement

CM Revanth Reddy: విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం

CM Revanth Reddy: విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం

CM Revanth Reddy: తెలంగాణలో SPDCL, NPDCL‌తోపాటు మరో డిస్కం ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో.. ప్రాథమిక ప్రణాళికను ఇంధన శాఖ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయం, మేజర్-మైనర్ లిప్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్‌ఎంసీ నీటి సరాఫరాలను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.


ప్రతిపాదనల నేపథ్యంలో ప్రణాళిక సిద్ధం చేసిన ఆఫీసర్స్
మూడో డిస్కంకు సంబంధించిన పీపీఏ ఏర్పాటు, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై అధికారులకు సీఎం సూచనలు చేశారు. కొత్త డిస్కం ఏర్పాటుపై కేబినెట్ ఆమోదం తర్వాత ఏర్పాటుపై ముందుకెళ్లాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. అప్పటిలోగా పూర్తిస్థాయి ప్రణాళికను సిద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీలో నీటి సరఫరాకు.. ప్రతిపాదనలు
గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై పలు ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. డీపీఆర్ తయారీ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్‌తో పాటు ముందుగా కోర్ అర్బన్ రీజియన్‌లో విద్యుత్ సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా రీప్లేస్మెంట్ చర్యలు చేపట్టాలన్నారు. సబ్ స్టేషన్ కెపాసిటీ కంటే ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకో వాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.


కేబినెట్ ఆమోదం తర్వాత.. కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలన్న సీఎం రేవంత్ రెడ్డి
కోర్ అర్బన్ రీజియన్లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అర్బన్ ఏరియాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లలో అధునా తన సాంకేతికను ఉపయోగించాలన్నారు. విద్యుత్ కేబుల్స్ పాటు ఇతర కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు బిగ్‌షాక్.. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన..

పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
బెంగుళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. డిసెంబర్‌లోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థా యి ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.

Related News

Minister Azharuddin: మంత్రి అజారుద్దీన్ కు కేటాయించిన శాఖలు ఇవే

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీ, ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Rain Alert: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Drugs Case: డాక్టర్‌ ఇంట్లో భారీగా డ్రగ్స్‌.. రూ.3 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం

Telangana News: ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్వే.. హెలికాఫ్టర్ నుంచి ప్రత్యక్షంగా తిలకించిన సీఎం రేవంత్-మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

Holiday: గుడ్‌న్యూస్.. రేపు ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నర్ ఆమోద ముద్ర, ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నా..

Hyderabad News: కోకాపేట్‌, మూసాపేట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరం రూ.99 కోట్లు

Big Stories

×