BigTV English
Advertisement

Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. రూ.35,400 జీతం.. ఇంకెందుకు ఆలస్యం

Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. రూ.35,400 జీతం.. ఇంకెందుకు ఆలస్యం

Jobs in RRB: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పోస్టులు, ఖాళీల వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ)దేశ వ్యాప్తంగా గల అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 పోస్టులతో సెక్షన్‌ కంట్రోలర్‌ (సీఈఎన్ నెం.04/2025) పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 14 వరకు ఆన్‌ లైన్‌ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జోన్‌ల వారీగా ఖాళీలు, ఎగ్జాన్ విధానం, తదితర నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా విడదుల చేయనున్నారు.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 368

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు లో సెక్షన్ కంట్రోలర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: క్వాలిఫికేషన్, జోన్ల వారీగా వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక ప్రక్రియ, ఎగ్జామ్ ప్రాసెస్, తదితర వివరాల గురించి అఫీషియల్ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

ఆర్ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, గోరఖ్‌పూర్, తిరువనంతపురం రీజియన్లలో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.35,400 వరకు జీతం ఉంటుంది.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 20 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

నోట్: ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఇంకా అఫీషియల్ సమాచారం వెలుబడలేదు. రెండు, మూడు రోజుల్లో అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

ALSO READ: Airport Authority of India: ఇది అద్భుమైన అవకాశం.. ఎయిర్‌పోర్టుల్లో భారీగా ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు బ్రో

Related News

SECL Notification: నిరుద్యోగులకు పండుగలాంటి న్యూస్.. ఎస్ఈసీఎల్‌లో భారీగా ఉద్యోగాలు, ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో

BSNL: బీఎస్ఎన్‌ఎల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. నెలకు రూ.50,500 జీతం, ఇంకెందుకు ఆలస్యం బ్రో

RRB NTPC: ఇంటర్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. మంచి వేతనం, ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్ గురూ..

Constable: 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేశారా…? ఇంకా నాలుగు రోజులే గడువు, డోంట్ మిస్

Intelligence Bureau: ఐబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు, నెలకు రూ.1,42,400 జీతం

AP TET 2025: ఏపీ టెట్ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ.. సిలబస్, పరీక్ష విధానం ఇలా

Inter exams: స్టూడెంట్స్‌కు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

UCO Bank: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్థానిక భాష వస్తే చాలు, ఇదే మంచి అవకాశం

Big Stories

×