Chicken Leg Thief| సోషల్ మీడియాలో ప్రతిరోజూ వింతగా, హాస్యాస్పదంగా ఉండే వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో ఒక మహిళ ఒక పెళ్లి వేడుకలో చికెన్ లెగ్ పీన్‌ని దొంగలిస్తూ కెమెరాకు చిక్కింది. ఈ వీడియో చూసి నెటిజెన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
విచిత్రమేమిటంటే ఆ పెళ్లి వేడుకలో ఆ మహిళ మంచి ఫ్యాషన్ దుస్తుల్లో కనిపిస్తోంది. అలాంటి వేషంలో ఉన్న ఓ లేడీ మరీ ఇంత చీప్ గా చికెన్ లెగ్ పీస్ దొంగచాటుగా తీసుకుంటూ ఉండడం చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే.. ఆ మహిళ చాలా ఈజీగా చికెన్ ఫుల్ లెగ్ పీస్ ని తీసుకొని. టిష్యూలో చుట్టి, తన పర్సు (హ్యాండ్‌బ్యాగ్)లో జాగ్రత్తగా పెట్టుకుంది. ఎవరూ ఊహించని ఈ చర్య సోషల్ మీడియాలో నెటిజెన్ల కంటపడగానే.. అందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ వీడియోను @MDaejazAlam1 అనే యూజర్ Xలో షేర్ చేశాడు.
ఇది ఒక్కరోజులోనే 50,000 కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది. ఒక యూజర్ జోక్ చేస్తూ, “ఇప్పుడు అర్థమైంది. పర్సులో కేవలం మేకప్ సామాన్లే కాదు, అత్యవసర ఆహారం కూడా ఉంటుంది!” అని రాశారు. మరొకరు, “ఈ మహిళ.. పర్సుని దాని నిజమైన పనికి ఉపయోగించింది,” అని సరదాగా అన్నారు. కొందరు దీన్ని “పర్ఫెక్ట్ జుగాడ్” అని పిలిచారు.
ఆమె ఎందుకు అలా చేసింది? అనే ప్రశ్నకు.. చాలామంది ఆమె ఆహారాన్ని వృథా చేయకూడదని భావించి ఉంటుందని కామెంట్ చేశారు. బహుశా ఆమె తినడం పూర్తి చేయలేక, ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించి ఉండవచ్చు. ఈ విధంగా చూస్తే.. ఆమె చర్య ఆహార వృథాను నివారించే ప్రయత్నంగా కూడా కనిపిస్తుంది. ఇది చాలామందికి సహజంగానే అనిపించింది.
ఇదే సమయంలో.. లండన్‌లోని మానర్ పార్క్‌లో జరిగిన ఓ పెళ్లి వీడియో కూడా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఒక పెళ్లికొడుకు సంప్రదాయ దుస్తుల్లో, తెల్ల గుర్రంపై ఊరేగుతూ కనిపించాడు. అతని వెనుక ఫెరారీ, మెర్సిడెస్ వంటి లగ్జరీ కార్లలో స్నేహితులు, అతిథులు ఉన్నారు. రంగురంగుల స్మోక్ బాంబులు, నిరంతర హారన్ శబ్దాలతో ఈ ఊరేగింపు జరిగింది. కానీ, ఈ హడావిడి స్థానికులను చిరాకు పెట్టింది.
ఇంటర్నెట్‌లో ఈ వీడియోపై స్పందనలు విభిన్నంగా ఉన్నాయి. కొందరు ఈ ఊరేగింపును ఉత్సవంగా ఆనందించారు. మరికొందరు శబ్ద కాలుష్యం, అనవసరమైన ఆడంబరాలను తప్పుబట్టారు. ఒక యూజర్ ఇలా రాశారు, “పెళ్లి సంతోషాన్ని మేము అర్థం చేసుకుంటాం, కానీ ఇతరుల శాంతి కూడా ముఖ్యం.”
Also Read: చనిపోయిన విష సర్పం..మనిషిని కాటేసిన 5 నిమిషాల్లోనే.. అతడి రక్తంలో ఏముందంటే