Gundeninda GudiGantalu Today episode September 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి చేత షాప్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని ఇంట్లోని వాళ్ళందరూ అంటారు. దాంతో ప్రభావతి సంతోషంతో గాల్లో ఎగిరిపోతూ ఉంటుంది. మనోజు అమ్మచేతే షాప్ ఓపెనింగ్ చేస్తానని అనడంతో ఆమె సంతోషంలో మునిగిపోతుంది. తర్వాత రోజు ఉదయం అందరూ షాప్ దగ్గరికి వెళ్తారు. షాప్ ఓనర్ వచ్చి మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ మనోజ్ కి ఇచ్చి వెళ్తాడు. ఇక రిబ్బన్ కట్ చేయడానికి ప్రభావతి వెయిట్ చేస్తూ ఉంటుంది. కామాక్షి అక్కడికి వచ్చింది.. అందరూ ఎవరికి కావాల్సిన సామాన్లు కొనుక్కుంటుంటే.. వీణ మాత్రం ఇంట్లోకి కావాల్సిన మిక్సీని కొనుక్కోవాలని అనుకుంటుంది.. బాలు దాని రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇంట్లోకి అవసరం అంటావా అని అడుగుతాడు. శోభన మీ కాస్ట్ లో ఖరీదైన సోఫా ఏది ఉందొ అది చెప్పు అని అడుగుతుంది. ఇక ఆ సోఫా నీ శోభన లక్షల 50 వేలు పెట్టి కొంటుంది. అక్కడ మీనాని అవమానించింది ప్రభావతి. ఇంకా మనోజ్ వర్కర్స్ నేనే తీసేసి కొత్తవాళ్ళని పెట్టుకోవాలని అనుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మనోజ్ వర్కర్స్ ని రమ్మని పిలుస్తాడు.. మీరు వయసు అయిపోయిన వాళ్ళు ఏం పని చేస్తారు. నాకు చేయాల్సిన అవసరం లేదు వెళ్ళిపోండి అని వర్కర్స్ ని దారుణంగా అవమానిస్తాడు మనోజ్. మేము పని చేయకుండానే ఈ షాపు ఎంత బాగా రన్ అవుతుందా సార్ మీరు ఒకసారి ఊహించకండి ఆలోచించండి విషయం గురించి అని వర్కర్స్ చెప్తారు. చెమటోడ్చి రక్తం చిందించి మేము ఇక్కడ పనిచేశాము అని వాళ్లంటారు. ఆ రక్తానికి వయసు అయిపోయింది మీరు వెళ్ళొచ్చు నేను ఎక్స్టర్స్ ని పెట్టుకున్నాను అని అంటాడు.
నువ్వు ఎలా బాగుపడతావో మేము చూస్తాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వర్కర్స్.. ఇక అలసిపోయి ఇంటికి వచ్చిన మనోజ్ ని ప్రభావతి దిష్టి తీసి ఇంట్లోకి రమ్మని చెప్తుంది. మీనా ఆ దిష్టి పడేయమని అంటుంది. కానీ బాలు మాత్రం నా భార్య చేదు అది ఏదో నువ్వే చేసుకో అని అంటాడు. అటు మనోజు అందరికీ ఆర్డర్లు వేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేయడానికి నీ దగ్గర పనిమనిషిని ఏమైనా ఉన్నారా నువ్వు నీ పెళ్ళాన్ని అడుగు నీకు కావలసినవన్నీ చేసిపెడుతుంది అని బాలు దిమ్మ తిరిగిపోయేలా సెటైర్లు వేస్తాడు.
డబ్బుడమ్మ ఎంతగా కష్టపడి అలసిపోయి ఉంటది ఏరోజైనా ఇంతగా ఆర్డర్లు వేసిందా అని అంటాడు. అలవాటైపోయిందిలే బాలు అని శ్రుతి అంటుంది. ఇక రూమ్ కోసం బాలు వెయిట్ చేస్తాడు . మనోజ్ ని ఎంత పిలిసినా కూడా నేను రాను రోహిణి నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పేసి అంటాడు. అదే విషయాన్ని రోహిణి అందరితో చెప్తుంది కానీ రూలు రూలే కదా అని బాలు రచ్చ చేస్తాడు.. కానీ ప్రభావతి మధ్యలో అడ్డుకొని రూమ్ఇవ్వడానికి ఒప్పుకోదు..
సత్యం కూడా ఈ విషయం గురించి ఏమీ మాట్లాడలేకపోతారు లేపమని ఎంత చెప్పినా సరే ప్రభావతి కావాలనే చేస్తుంది. ఇక బాలు మీనా దగ్గరికి వెళ్లి వాళ్ళు కావాలనే మన దగ్గర డబ్బులు లేవని ఇలా చేస్తున్నారని బాధపడతాడు. కాని మీనా మాత్రం నాకేమీ బాధ లేదు నేను ఇక్కడే బాగా ఉందని పడుకున్నాను అని మీనా సర్ది చెప్పి బాలుని కంట్రోల్ చేస్తుంది.. ఉదయం లేవగానే మీనా సత్యం కు కాఫీ ఇస్తుంది… అయితే మనోజ్ కి పైకి వెళ్లి కాఫీ ఇవ్వమని ప్రభావతి చెప్తుంది.
కానీ నేను ఇవ్వను అని నేను అంటుంది. ఆయనకు పెళ్లయింది కదా ఆయన వాళ్ళ భార్య చేత తాగుతాడులే అని వెటకారంగా సమాధానం చెబుతుంది. మీనా. అప్పుడే రోహిణి అక్కడికి వచ్చి మనోజ్ ఎంత లైఫ్ లో లేవట్లేదు అని అంటుంది. నేను ఎంత ట్రై చేసినా కూడా లేవట్లేదు అత్తయ్య అనగానే మీనా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ప్రభావతి మీనా నవ్విందని దిగులు పడుతుంది. ఇక మనోజ్ ని ఇప్పటికైనా నిద్రలేపి షాప్ కి వెళ్ళమని చెప్పమని ప్రభావతి పై సీరియస్ అవుతాడు సత్యం.
Also Read : నాగీ మామ ఇప్పుడు ఎక్కడున్నావ్.. పెద్ద ప్లానింగే..?
అదేంటి శృతి రవి ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందకి దిగివస్తారు. అయితే ప్రభావతిని వాన్ని లేపి షాప్ కి వెళ్ళమని చెప్పు అని సత్యం అంటాడు.. మనోజ్ ని మెల్లగా నిద్ర లేపుతుంది అందరూ చూసి నవ్వుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి…