ESIC Posts: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఇండోర్ నుంచి కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబరు 29, 30, 31వ తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరు అవ్వొచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 124
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు
ప్రొఫెసర్ : 14 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్: 23 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్: 30 పోస్టులు
సీనియర్ రెసిడెంట్: 57 పోస్టులు
వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, ప్రసూతి & గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, అనస్థీషియాలజీ, యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 అక్టోబర్ 21 నాటికి సీనియర్ రెసిడెంట్ ఉద్యోగానికి 45 ఏళ్లు మించరాదు. ఇతర పోస్టులకు 69 ఏళ్ల వయస్సు మించరాదు.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి జపీతం ఉంటుంది. నెలకు ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ.1,23,100 జీతం ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.78,800 జీతం ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్‌కు రూ. 67,700 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా dean-indore.mp@esic.gov.in అక్టోబర్ 21లో దరఖాస్తును పంపించాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ డేట్స్: అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూలు ఎక్కడంటే: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందా నగర్, ఇందౌర్
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://esic.gov.in/
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 124
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 21లోగా మెయిల్ కు దరఖాస్తు చేయాలి..