Vinutha Kota: శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నాయకురాలు వినుత కోటా సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో.. ‘తెలుగింటి అడ బిడ్డగా రాష్ట్ర ప్రజలకు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వస్తున్నాను. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాం, త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించి అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది’ అని అన్నారు.
చేయని తప్పునకు జైలుకు వెళ్లామన్న బాధకంటే హత్య చేశామని చెప్పడమే తమను ఎంతో బాధించిందని వినుత కోటా అన్నారు. రాయుడు మృతిలో తమ ప్రమేయం లేదని భావించే 19 రోజుల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని ప్రకటించారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చీట్ తో బయటకు వస్తామన్నారు. కేసుపై చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువగా మాట్లాడలేనన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నామని వినుత కోటాతెలిపారు. పవన్ అపాయింట్‌మెంట్ కోరామన్నారు.
నేను మీ వినుత కోటా, తెలుగింటి అడ బిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పని చేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వస్తున్నాను.
– మేము ప్రస్తుతం చెన్నై లో ఉన్నాము… pic.twitter.com/QApig3RuFU
— Vinutha Kotaa (@VinuthaKotaa) October 13, 2025
శ్రీకాళహస్తి జనసేన మాజీ నేత కోటావినుత డ్రైవర్ రాయుడు పేరిట ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వినుత కోటా డ్రైవర్ రాయుడు చనిపోవడానికి ముందు రికార్డు చేసిన సుమారు 19 నిమిషాల సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో రాయుడు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వినుత దంపతులను చంపాలని లేదా వారి ప్రైవేట్ వీడియోలు తీసి పంపిస్తే రూ. 30 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులు ఆఫర్ చేశారని రాయుడు ఈ వీడియోలో చెప్పాడు.
Also Read: Pawan – Vijay: విజయ్‌కు పవన్ సలహా.. ఆ తప్పు చేయొద్దంటూ హితబోధ?
వినుత బెడ్రూమ్‌లో కెమెరాలు పెట్టి దొరికిపోయానని, అందుకే డ్రైవర్ ఉద్యోగం నుంచి తనను తొలగించారని రాయుడు తెలిపారు. ఈ పరిణామాల తర్వాత రాయుడు అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. రాయుడు హత్య కేసులో వినుత కోటను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. అయితే అనంతరం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టైన వారందరికీ బెయిల్ వచ్చింది.