Pooja hegde: పూజా హెగ్డే(Pooja hegde) అక్టోబర్ 13వ తేదీ తన 35 వ పుట్టినరోజు (Birthday) వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈమెకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే పూజ హెగ్డే తన పుట్టినరోజు వేడుకలను తన సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో ఈమెకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే పూజ హెగ్డేకు విష్ చేస్తూ తన రూమర్ద్ బాయ్ ఫ్రెండ్ రోహన్ మెహ్ర షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
పూజా హెగ్డే గత కొంతకాలంగా రోహన్ మెహ్రా (Rohan Mehra)తో రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల పట్ల వీరిద్దరు ఎక్కడ స్పందించలేదు. ఇలా సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో నేడు పూజా హెగ్డేకు ఈయన శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెతో కలిసి దిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూజా హెగ్డేతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డేటుద బెస్టెస్ట్ గర్ల్ పూజ హెగ్డే… కీప్ షైనింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ విధంగా రోహన్ మెహ్రా పూజా హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో మరోసారి తెరపైకి వీరి డేటింగ్ రూమర్స్ చర్చలకు కారణమయ్యాయి. ఇకపోతే పూజా హెగ్డే ఇటీవల కాలంలో పలు సినిమాలలో నటిస్తున్న ఆశించిన స్థాయిలో ఈమె ఫలితాలను అందుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇలా సినిమాలు ప్రేక్షకులను నిరాశపరచడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూజా హెగ్డే తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.
దుల్కర్ కు జోడిగా పూజ హెగ్డే..
ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం తెలుగులో ఈమె రవి నెలకుడితి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక నేడు ఈమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా కోసం పూజ హెగ్డే భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలి సినిమాలో మోనిక అంటూ స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పాట మంచి సక్సెస్ కావడంతో పూజకు సౌత్ ఇండస్ట్రీలో తిరిగి అవకాశాలు క్యూ కడుతున్నాయి.
Also Read: Telusu Kada Trailer: గ్యారెంటీ ఇవ్వటానికి నేను సేల్స్ మెన్ కాదు.. క్రేజీగా తెలుసు కదా ట్రైలర్ !