Flipkart vs Amazon: పండుగ సీజన్ మొదలైన వెంటనే మార్కెట్ మొత్తం ఆఫర్ల హంగామాలో మునిగిపోయింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల మీద వచ్చే ఆఫర్లే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అనే రెండు దిగ్గజాలు సగం ధరకే ఫోన్లు ఇస్తున్నాయనే మాట వినగానే ప్రజలు ఎవరి సైట్‌లో ఎక్కువ తగ్గింపు ఉందో, ఏదీ మంచిదో తెలుసుకోవడానికే ఆతృతగా ఉన్నారు. కానీ నిజంగా ఏదే లాభదాయకం? అనే ప్రశ్నకు సమాధానం కొంచెం లోతుగా చూడాల్సిందే.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిల్లియన్ డేస్ సేల్
ఫ్లిప్‌కార్ట్ తన “బిగ్ బిల్లియన్ డేస్ సేల్” పేరుతో ప్రతి సంవత్సరం భారీ తగ్గింపులు ప్రకటిస్తుంది. ఈసారి కూడా మధ్యస్థాయి, తక్కువ ధర ఫోన్ల మీద భారీ ఆఫర్లు ఇస్తుంది. పాత ఫోన్ ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా కొత్త ఫోన్‌ను అతి తక్కువ ధరలో పొందవచ్చు. ఉదాహరణకు పదిహేనువేల రూపాయల ఫోన్ పాత ఫోన్ ఇచ్చి పది వేలకు దొరుకుతుంది. అలాగే బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఇఎంఐ సౌకర్యం వంటివి కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ సైట్‌లో పోకో,ఇన్ఫినిక్స్,మోటోరోలా,రియల్ మీ,రెడ్మీ లాంటి బ్రాండ్ల ఫోన్లు ఎక్కువగా తగ్గింపు ధరల్లో లభిస్తున్నాయి. అయితే కొన్నిసార్లు డెలివరీ ఆలస్యం, ప్యాకేజింగ్ సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ రీప్లేస్‌మెంట్ పాలసీ కొంచెం వేగంగా పనిచేస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
మరోవైపు అమెజాన్ కూడా “గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్” పేరుతో బలమైన ఆఫర్లు ఇస్తోంది. కానీ అమెజాన్‌లో ఎక్కువగా ప్రీమియం బ్రాండ్లు తగ్గింపుతో వస్తాయి. ఐఫోన్, వన్‌ప్లస్, సామ్‌సంగ్, గూగుల్ పిక్సెల్ వంటి ఫోన్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఉదాహరణకు ఐఫోన్14 మోడల్ సుమారు యాభై వేలకు దిగిపోయింది. అలాగే కొత్త మోడల్ అయిన ఐఫోన్ 15 కూడా పదివేల వరకు తగ్గింపుతో దొరుకుతోంది. ఇక్కడ డెలివరీ వేగంగా వస్తుంది, ప్యాకేజింగ్ కూడా సురక్షితంగా ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ అద్భుతంగా ఉండటంతో ప్రీమియం ఫోన్ల కోసం అమెజాన్‌ను చాలా మంది నమ్ముతారు.
Also Read: Jio New Recharge Plan: జియో కొత్త ప్లాన్స్ షాకింగ్ వివరాలు.. రూ.448 నుండి రూ.895 వరకూ లాభాలే లాభాలు
అయితే రెండు సైట్‌లలోనూ ఒక జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి అంటే ఫేక్ సెల్లర్లను గుర్తించడం. ఫ్లిప్‌కార్ట్ అష్యూర్డ్ లేదా అమెజాన్ ద్వారా నెరవేర్చబడింది అని ఉన్న ప్రోడక్ట్‌లనే కొనాలి. అవే నమ్మదగినవి. ఇంకో విషయం ఏమిటంటే, ఆఫర్‌లో చూపించే ధరలో బ్యాంక్ డిస్కౌంట్, కూపన్, ఎక్సేంజ్ విలువ వేర్వేరుగా ఉంటాయి. అందుకే చివరి బిల్లింగ్ స్క్రీన్‌లో మొత్తం ఎంత ఖర్చవుతుందో చూసి నిర్ణయం తీసుకోవాలి.
ఏది బెటర్
ఎవరికి ఏ సైట్ మంచిదన్నదానికి వస్తే, తక్కువ ధరలో ఫోన్ కొనాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ మంచి ఆప్షన్. ప్రీమియం లేదా బ్రాండెడ్ ఫోన్ కావాలనుకునే వారికి అమెజాన్ బెస్ట్ ఆప్షన్. రెండు సైట్‌లూ తమదైన ప్రయోజనాలు కలిగి ఉన్నా, జాగ్రత్తగా పరిశీలిస్తేనే మనకు నిజమైన లాభం ఉంటుంది.
క్లారిటీ తీసుకుని కొనండి లేదంటే ఇబ్బంది పడతారు
ఇక చాలా మంది ఆఫర్ ఉందని వెంటనే ఈఎంఐ ఆఫర్ తీసుకుని వడ్డీ భారంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఫోన్ నిజంగా అవసరమైతేనే కొనాలి. అలాగే రివ్యూలు చదవకుండా, సైట్‌లో చూపించిన ఫోటో చూసి కొనడం ప్రమాదకరం. కొన్నిసార్లు ఆఫర్ పేరుతో పాత మోడళ్లను కూడా అమ్ముతారు. అందుకే మోడల్ నంబర్, లాంచ్ సంవత్సరం, ఫీచర్లు అన్నీ చెక్ చేయాలి.
ఆఫర్లు ఇక్కడితో అయిపోవు.. ఎందుకంటే
మరి ఇంకో విషయం ఈ పండుగ సీజన్‌తో మాత్రమే ఆఫర్లు ముగిసిపోవు. డిసెంబర్ చివర్లో లేదా న్యూ ఇయర్ సేల్ సమయంలో కూడా కొత్త మోడళ్లపై తగ్గింపులు వస్తాయి. కాబట్టి ఆతురపడకుండా రెండు సైట్‌ల ధరలను పోల్చి చూడడం మంచిది. కానీ మనం తెలివిగా ఎంపిక చేసుకుంటేనే ఆ సగం ధర ఆఫర్ మనకే సగం లాభం అవుతుంది. లేకపోతే బయటకు సగం ధరలా కనిపించినా, లోపల మన జేబు సగం ఖాళీ అయిపోతుంది.