Radhamma Kuthuru Serial Actress Deepthi Manne: ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్లి భాజాలు ఎక్కువగా మోగుతున్నాయి. సినీ,టీవీ పరిశ్రమకు చెందిన నటీనటులు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవల మ్యాడ్ మూవీ ఫేం, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఓ ఇంటివాడు అయ్యాడు. అలాగే బుల్లితెరకు చెందని సీరియల్ నటీనటులు కూడా వరుసగా పెళ్లి కబురు చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ టీవీ నటి, రాధమ్మ కూతురు (Radhamma Kuthuru Serial, జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే (TV Actress Deepthi Manne) ప్రియుడిని పరిచయం చేసింది. వారం క్రితం ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది.
ఈ సందర్బంగా ప్రియుడితో రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసింది. అయితే అతడేవరు, ఎలా ఉంటుందనేది చూపించలేదు. ‘ఎస్.. నేను లవ్లో ఉన్నాను‘ అంటూ ప్రియుడితో ఉన్న ఫోటోలు రివీల్ చేసింది. కానీ, అతడేవరనేది మాత్రం సస్పెన్స్లో ఉంచింది. అంతేకాదు ఫోటోల్లో కూడా అతడి ఫేస్ రివీల్ కాకుండ జాగ్రత్త పడింది. దీంతో అంత డైలామాలో పడ్డారు. దీప్తి బాయ్‌ఫ్రెండ్ ఎవరూ, ఇండస్ట్రీలో వ్యక్తినే అని అభిమానులంత ఫుల్ క్యూరియాసిటీగా ఉన్నారు. ఈ క్రమంలో తన ప్రియుడిని పేరు చెప్పడమే కాదు.. ఈసారి ఏకంగా అతడిని చూపించింది. తన బాయ్ ఫ్రెండ్ పేరు రోహన్ అని పరిచయం చేసింది.
Also Read: Keerthy Suresh: జగపతి బాబుకి క్షమాపణలు చెప్పిన కీర్తి సురేష్.. కారణమేంటంటే!
ఇద్దరు కలిసి దిగిన రొమాంటిక్ ఫోటో షూట్ని షేర్ చేస్తూ.. ప్రియుడికి అందమైన ప్రేమ లేఖ రాసింది. “డియర్ రోహన్.. నేను ఇంతకాలం ఎదురుచూస్తున్న వ్యక్తి నువ్వే. ఆ దేవుడే నిన్ను నాకు బహుమతిగా పంపించాడు. నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్యూ. ఐ లవ్ యూ” అంటూ తన పోస్ట్కి రాసుకొచ్చింది. దీంతో దీప్తికి ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే ప్రియుడిని అయితే పరిచయం చేసింది కానీ, పెళ్లి ఎప్పుడనేది క్లారిటీ లేదు. దీంతో ఆమె పోస్టుకి స్పందిస్తూ.. పెళ్లి ఎప్పుడు అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది దీప్తి మన్నే పెళ్లి పీటలు ఎక్కనుందని సన్నిహితవర్గాల నుంచి సమాచారం.
ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు బాయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేయడం దీప్తి మన్నే టీవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన దీప్తి మన్నే రాధమ్మ కూతురు సీరియల్తో తెలుగు టీవీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ప్రస్తుం జగద్దాత్రి, పద్మావతి, వంటి సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తోంది. ఇక సెలవ్ అనే తెలుగు మూవీతో వెండితెరపై కూడా మెరిసింది. అలాగే కన్నడలో యెవన్, దేవదాస్ బ్రదర్స్, కర్త, హింగ్యాకే వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది.