AISSEE Admissions: దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్స్ 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE 2026) నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. విద్యార్థులు exams.nta.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
జనరల్/ఓబీసీ(NCL)/డిఫెన్స్/ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ. 850 కాగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.700
పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్/UPI ద్వారా చెల్లించవచ్చు.
6, 9వ తరగతులకు ఓఎంఆర్ షీట్ విధానంలో ఆబ్జెక్టివ్ పరీక్షను నిర్వహిస్తారు. 9వ తరగతి ప్రవేశ పరీక్ష 180 నిమిషాల పాటు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 6వ తరగతి ప్రవేశాలకు 150 నిమిషాల పాటు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 13 భాషలలో ఈ పరీక్ష జరుగుతుంది.
Also Read: ESIC Posts: ఈఎస్ఐసీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే ఉద్యోగం నీదే బాస్, డోంట్ మిస్
అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ తేదీని NTA త్వరలోనే ప్రకటిస్తుంది. పరీక్ష ఫలితాలు పరీక్ష ముగిసిన నాలుగు నుండి ఆరు వారాల తర్వాత విడుదల చేస్తారు. విద్యార్థులకు సందేహాల ఉంటే NTA హెల్ప్ డెస్క్ 011-40759000 కు కాల్ చేయవచ్చు లేదా aissee@nta.ac.in మెయిల్ చేయవచ్చు.