Jagtial District: ఇటీవల కాలంలో దేశంలో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్తి కోసం సొంత అన్నదమ్ములను, అక్కాచెల్లెళను సైతం చంపడానికి వెనుకాడడం లేదు. నిత్యం దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట ఇలాంటి దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు, పోలీస్ అధికారులు ఎన్ని కఠిన చర్యలు విధించినా కొందరి తీరు మాత్రం మారడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ తండ్రిని ఆస్తి వివాదాల కారణంగా తన తాత, బాబాయ్ కలిసి చంపేశారని వారి భూమి, ఇల్లు లాక్కున్నారంటూ ఇద్దరు చిన్నారులు కలెక్టర్ కు వినతి ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ జగిత్యాల జిల్లాలో ప్రజావాణికి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ప్రజావాణికి వచ్చింది. ప్రజావాణిలో తమ తండ్రిని భూ వివాదాలతో తాత, బాబాయ్ కలిసి చంపేశారని… వారి భూమి, ఇల్లు లాక్కున్నారంటూ కలెక్టర్‌కు వినతి అందజేశారు. జగిత్యాల జిల్లా మోహన్‌రావు పేట గ్రామానికి చెందిన లాస్య, తన ఇద్దరు పిల్లలతో ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. ఆ చిన్నారులు ఇద్దరు తమ తండ్రిని చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. భర్తను తలచుకుని స్టేజ్ పైనే ఏడ్చేసిన మాగంటి సునీత
తమ తండ్రి పేరు మీద ఉన్న 5ఎకరాల భూమిని,ఇంటిని లాక్కొని… గెంటేశారని వాపోయారు. పంట పొలంపై కోర్టులో కేసు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమ భూమి కావాలని అడిగితే చంపేస్తామంటూ.. దాడి చేశారన్నారు. చిన్నారులు ఎలాగైనా తమకు న్యాయం చేయాలంటూ ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తనకు ఏదైనా ఉపాధి కల్పిస్తే, రుణపడి ఉంటానని… జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించి, కన్నీటి పర్యంతమయ్యారు చిన్నారుల తల్లి కోట లాస్య.
ALSO READ: ESIC Posts: ఈఎస్ఐసీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే ఉద్యోగం నీదే బాస్, డోంట్ మిస్