keerthy suresh Appolgies jagapathi Babu: మహానటి కీర్తి సురేష్ సీనియర్ నటుడు జగపతి బాబుకి క్షమాపణలు చెప్పింది. తాజాగా ఆయన హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయంబు‘ టాక్ షోకి కీర్తి అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన కెరీర్, ప్రేమ, పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. అయితే ఒక విషయంలో తాను చేసిన పోరపాటుకి జగపతి బాబుని క్షమాపణలు కోరింది. ఇంతకి అసలేం జరిగింది, కీర్తి జగపతి బాబుకి సారీ ఎందుకు చెప్పిందో ఇక్కడ చూద్దాం!
కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నేనూ శైలజా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన రెండో చిత్రం మహానటితో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన ఆ స్థాయిలో హిట్, గుర్తింపు అందుకోలేకపోయింది. ముఖ్యంగా ఆమె నటించి లేడీ ఒరియంటెడ్ చిత్రాలు వరుసగా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఆ తర్వాత రూటు మార్చి మళ్లీ గ్లామర్ రోల్స్‌లోకి వచ్చింది. సర్కారి వారి పాటలో మహేష్ బాబు సరసన జతకట్టి హిట్ అందుకుంది.
హీరోయిన్గా తెలుగులో ఆమె హిట్ కొట్టిన చివరి చిత్రమిది. ఓ వైపు హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ ఉన్నప్పుడు చెల్లెలి పాత్రలో నటించి సాహసం చేసింది. భోళా శంకర్లో చిరంజీవి సరసన చెల్లెలుగా నటించింది. కానీ ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేదు. ఆ తర్వాత బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ రిలీజ్ సిద్దమౌవుతుండగానే పెళ్లి చేసుకుంది. తన చిరకాల ప్రియుడు ఆంటోని తటిల్తో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత కీర్తి విజయ్ ‘రౌడీ జనార్థన్’ చిత్రంతో తెలుగులో మళ్లీ ఎంట్రీ ఇస్తుంది. పెళ్లి తర్వాత ఈ భామ నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా‘ షోలో పాల్గొని సందడి చేసింది.
ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి నా ప్రేమ గురించి తెలుసు. అందులో మీరు (జగపతి బాబు) ఒకరు. నేను మిమ్మల్ని నమ్మాను కాబట్టి నా ప్రేమ విషయాన్ని మీతో చెప్పాను. కానీ, మిమ్మల్ని పెళ్లికి పిలవలేకపోయాను. నన్ను క్షమించండి. బిజీ షెడ్యూల్, వెంటవెంటనే పెళ్లి ఏర్పాట్ల కారణంగా కొంతమందిని పిలవడం కుదరలేదు. అందుకే అందరి ముందు మీకు క్షమాపణలు చెబుతున్నా” అంటూ జగపతిబాబును కీర్తి క్షమాపణలు కోరింది. ఇక తాను ఆంటోని 15 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నామని, పెళ్లి టైం వరకు ఇంట్లో చెప్పి ఒప్పిందాం అనుకున్నామని చెప్పింది. కానీ, నాలుగేళ్ల క్రితమే మా ప్రేమ విషయం చెప్పి ఇంట్లోని వాళ్లని ఒప్పించాం. గతేడాది వరకు తట్టిల్ ఖతర్‌లో ఉన్నాడు, తను ఇండియాకు వచ్చాక పెళ్లి చేసుకున్నామని కీర్తి చెప్పుకోచ్చింది. కాగా కీర్తి సురేష్, జగపతి బాబు కలిసి ‘మిస్ ఇండియా‘ చిత్రంలో నటించారు. ఉమెన్ సెంట్రిక్గా వచ్చిన ఇందులో కీర్తి లీడ్ రోల్ పోషించగా.. జగపతి బాబు విలన్గా కనిపించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద పెయిల్ అయ్యి కీర్తికి మరో ప్లాప్గా నిలిచింది.