Bigg Boss 9 Promo:బిగ్ బాస్ సీజన్ 9 మొదటి నుండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని హోస్ట్ నాగార్జున చెప్పుకుంటూనే వస్తున్నారు. నాగార్జున చెప్పినట్లుగానే ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే ఈసారి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిని, కామనర్స్ ని ఎక్కువగా తీసుకున్నారు. అయితే ఇప్పటికే 5 వారాలు గడిచాయి. నాలుగు వారాలలో ఒక్కొక్కరే ఎలిమినేట్ అయినప్పటికీ ఐదో వారంలో మాత్రం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అంతేకాకుండా ఐదో వారంలో ఆరుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్లారు. తాజాగా ఆరో వారం స్టార్ట్ అయింది.అయితే ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ లో వార్ స్టార్ట్ అయింది..
తాజాగా విడుదలైన ప్రోమోలో ఏముందంటే..ఈ వారం ఎవరు నామినేట్ అయి ఇంటి నుండి బయటికి వెళ్లాలో నిర్ణయించే శక్తి వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన ఫైర్ స్ట్రోమ్ చేతుల్లో ఉందని చెప్పారు బిగ్ బాస్. నామినేషన్స్ లో వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన ఫైర్ స్టోర్మ్ కి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో బాల్ బజర్ మోగేసరికి ఎవరి దగ్గర ఉంటే వాళ్లు ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ లో ఒకరిని ఎంచుకొని ఆ బాల్ ఇవ్వాలి. అలా బాల్ తీసుకున్న వాళ్లు తమకు నచ్చిన వారిని నామినేట్ చేయవచ్చు. అలా సాగిన ఈ టాస్క్ లో మొదట బాల్ సీరియల్ నటుడు నిఖిల్ నాయర్ తీసుకొని తనూజా కి ఇచ్చారు.
అలా తనూజా మొదట సుమన్ శెట్టిని నామినేట్ చేసి మీరు అందరితో కలిసి ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్పగా.. ఇప్పుడు నువ్వు ఏడ్చినా అలిగినా నీ దగ్గరికి వచ్చి మొదటి ముద్ద తినిపించేవాడిని నేనే అంటూ సుమన్ కౌంటర్ ఇస్తాడు. ఆ తర్వాత రాము రాథోడ్ ని నామినేట్ చేస్తుంది.. తనూజా నామినేషన్ పాయింట్ కి రాము రాథోడ్ తనదైన స్టైల్ లో ఇచ్చి పడేస్తాడు. నువ్వు ఒకరికి ఒకలా మరొకరికి ఇంకోలా ఉంటున్నావ్ అని నా అభిప్రాయం అంటూ తనూజా కౌంటర్ ఇస్తుంది.ఆ తర్వాత బజర్ మోగగానే బాల్ పట్టుకోడానికి ఫైర్ స్టోర్మ్ గ్యాంగ్ పరిగెత్తుతారు. అలా రమ్య మోక్ష బాల్ పట్టుకొని చివరికి మళ్లీ బజర్ మోగగానే బాల్ తీసుకెళ్లి రాము రాథోడ్ చేతికి ఇస్తుంది.ఇక రాము రాథోడ్ తన నామినేషన్స్ లో రీతు, పవన్ ల పేర్లు చెబుతారు. బిగ్ బాస్ గేమ్ క్లియర్ కట్ గా అనౌన్స్ చేశాడు.
కానీ పవన్, రీతు ఇద్దరు ఫౌల్ గేమ్ ఆడారని ,నేను అబ్జర్వ్ చేశాను అంటూ రాము చెప్పడంతోనే రీతు రాము అంటూ గట్టిగా అరిచేస్తుంది. బిగ్ బాస్ చెప్పాక ఫౌల్ గేమ్ అని నువ్వు చెప్పడం కాదు.నువ్వు సంచాలక్ కాబట్టి నువ్వే ఇది ఫౌల్ గేమ్ అని ముందే డిస్క్వాలిఫై చేయాలి అంటూ అరుస్తుంది. నీ వల్ల గేమ్ రద్దు అయింది అంటూ రాము చెబుతుండగా.. రీతు మరి నువ్వేం చేస్తున్నావ్ అంటూ అరిచేసింది. ఆ తర్వాత పవన్ గురించి మాట్లాడుతూ.. రీతుతో కలిసి నువ్వు అలా చేస్తావని అనుకోలేదని అంటే.. నువ్వు సంచాలక్ గా పడుకున్నావని అనుకుంటా అంటూ రీతు మధ్యలోకి వస్తుంది. నేను నీతో మాట్లాడట్లేదని రాము ఎంత చెప్పిన వినకుండా నేను నీతోనే మాట్లాడుతాను అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా వాయిస్ రేజ్ చేస్తుంది. అలా మొత్తంగా నామినేషన్స్ లో పెద్ద రచ్చ జరిగేలా ఉంది అని ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. మరి ఎవరు ఎవరిని నామినేట్ చేశారు.. ? ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారు? అని తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
also read:Toxic: టాక్సిక్ నుండి హీరో లుక్ లీక్.. ఆ స్వాగ్ చూసారా?