నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రూప్-ఏ గెజిటెడ్ విభాగంలో మొత్తం 243 సైంటిస్ట్-బి పోస్టులను భర్తీ చేయనున్నారు. టెక్నాలజీ రంగంలో నిపుణులైన యువతకు ఇది గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలో ఈ సంస్థలో పనిచేయడం ద్వారా అభ్యర్థులు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశం. మార్చి 19న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న 243 ఖాళీలలో రిజర్వేషన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ కింద 100 పోస్టులు కేటాయించారు. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 65 స్థానాలు ఉన్నాయి. ఎస్సీలకు 36, ఎస్టీలకు 18, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 24 పోస్టులను కేటాయించారు.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 243
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు భారీ వేతనం లభిస్తుంది. ఇతర అలవెన్సులు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందుతాయి.
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌తో పాటు ఎంఫిల్ చేసిన వారు కూడా దరఖాస్తుకు అర్హులు అవుతారు. వీటితో పాటు కచ్చితంగా 2024 లేదా 2025 లేదా 2026 సంవత్సరాల్లో పొందిన వ్యాలిడ్ గేట్ (GATE) స్కోర్ కలిగి ఉండాలి. గేట్ స్కోర్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.
చివరి తేది: దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గేట్-2026 ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ఫలితాలు మార్చి 19, 2026న విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడిన పది రోజుల్లోపు ఎన్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి స్థాయి నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుంది. ఆ సమయం నుంచే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 19
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్‌డేట్స్ తెలుసుకోవాలి. అత్యున్నత స్థాయి టెక్నాలజీతో కూడిన ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఏదైనా సందేహం ఉంటే అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://recruitment.nic.in/
ALSO READ: IDBI Recruitment: డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు భయ్యా.. ఈ జాబ్ కొడితే గోల్డెన్ లైఫ్