BigTV English

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

SGPGIMS: 262  ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

SGPGIMS: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త.. సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎస్‌జీపీజీఐఎంఎస్) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. పీజీ, డీఎన్‌బీ, ఎండీ/ఎంఎస్‌/డీఎం, ఎంసీహెచ్‌ పాసై వారు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉన్నవారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు- వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎస్‌జీపీజీఐఎంఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, అడిషనల్ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు ఆన్‌లైలో దరఖాస్తులు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 262


సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు: 

1. ప్రొఫెసర్‌
2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
3. అడిషనల్ ప్రొఫెసర్‌
4. అసోసియేట్‌ ప్రొఫెసర్‌

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో పీజీ, డీఎన్‌బీ, ఎండీ/ఎంఎస్‌/డీఎం, ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయస్సు:  సెప్టెంబర్‌ 8వ తేదీ నాటికి 50 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,01,500 – రూ.1,67,400 జీతం ఉంటుంది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,38,300 – రూ.2,09,200 జీతం ఉంటుంది. అడిషనల్ ప్రొఫెసర్‌కు రూ.1,48,200 – రూ.2,11,400 జీతం ఉంటుంది. ప్రొఫెసర్‌కు రూ.1,68,900 – రూ.2,20,400 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 8

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2000 ఫీజు ఉంటుంది. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://sgpgims.org.in/

నోటిఫికేషన్ ముఖ్యం సమాచారం:

మొత్తం వెకెన్సీల సంఖ్య: 262

దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 8

ALSO READ: ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×