IPPB Recruitment: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. డిగ్రీ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. నెలకు ప్రారంభ వేతనమే రూ.30,000 ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు – వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)దిల్లీ దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 348 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 348
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి..
వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వెకెన్సీలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ వెకెన్సీలు ఉన్నాయి.. తెలంగాణలో 9 పోస్టులు, ఏపీలో 8 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా వెకెన్సీలు..
1. తెలంగాణ: 09 పోస్టులు
2. ఆంధ్రప్రదేశ్: 8 పోస్టులు
3. అస్సాం: 12 పోస్టులు
4. బిహార్: 17 పోస్టులు
5. ఛత్తీస్‌గఢ్: 9 పోస్టులు
6. గుజరాత్: 29 పోస్టులు
7. దాద్రా & నగర్ హవేలీ: 1 పోస్టులు
8. హరియాణ: 11 పోస్టులు
9. హిమాచల్ ప్రదేశ్: 4 పోస్టులు
10. జమ్మూ &కశ్మీర్: 3 పోస్టులు
11. ఝార్ఖండ్: 12 పోస్టులు
12. కర్ణాటక: 19 పోస్టులు
13. కేరళ: 6 పోస్టులు
14. మధ్యప్రదేశ్: 29 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: 2025 ఆగస్టు 1వ తేది నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ప్రారంభ వేతనమే రూ.30వేల వరకు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750 ఫీజు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 9
దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 29
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://ippbonline.com/
అప్లికేషన్ లింక్: https://ibpsonline.ibps.in/ippblaug25/