Mohan Lal : మలయాళ నటుడు, సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈయన నందకిషోర్(Nanda Kishore) దర్శకత్వంలో కనెక్ట్ మీడియా, ఏవిఎస్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన “వృషభ”(vrussabh) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటి ఒక పోస్టర్ విడుదల చేశారు. వృషభ సినిమాని నవంబర్ ఆరవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు.
ఇక ఈ సినిమా నుంచి ఇదివరకే విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మోహన్ లాల్ 2025వ సంవత్సరంలోనే ఏకంగా ఐదు సినిమాలను విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ఈయన నటించిన ఎంపురాన్, తుడరుం, హృదయపూర్వం సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు వృషభ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి మోహన్ లాల్ నటించిన నాలుగు సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఇక ఐదవ సినిమా విషయానికి వస్తే ఇటీవల మంచు విష్ణు హీరోగా తన డ్రీం ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నప్ప సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమాలో కూడా మోహన్ లాల్ నటించి వెండి తెరపై సందడి చేశారు. ఇలా ఈ సినిమాతో కలిపి ఐదు సినిమాలను విడుదల చేయడంతో మోహన్ లాల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..
ఇటీవల కాలంలో ఒక హీరో ఒకే ఏడాది నాలుగు పూర్తిస్థాయి సినిమాలను విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక సినిమా విడుదలకు సుమారు రెండు, మూడు సంవత్సరాల సమయం తీసుకుంటున్న నేపథ్యంలో మోహన్ లాల్ మాత్రం ఒకే ఏడాది నాలుగు సినిమాలను విడుదల చేయడంతో ఈ హీరోని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ పలువురు సినీ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు. మోహన్ లాల్ గత నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలను అందించారు. వందల సినిమాలలో నటించిన మోహన్ లాల్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే 2023 అవార్డును కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: Nuvvu Naku Nachav: మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న నువ్వు నాకు నచ్చావ్.. రీ రిలీజ్ ఎప్పుడంటే?