Indian Army: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. ఇండియన్ ఆర్మీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. టెన్త్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఆర్మీ మొత్తం 194 గ్రూప్ సి పోస్టులను భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4, 2025న ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 24. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 194
ఇండియన్ ఆర్మీలో ఎల్‌డీసీ, ఫైర్ మెన్, లోయర్ డివిజన్ క్లర్క్ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు టెన్త్, ఇంటర్ లేదా ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 4
దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 24
ఈ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీలు ఉండాలి. ఛాతీ 81. సెం.మీలు ఉండాలి. బరువు 50 కేజీలు ఉండాలి.
వయస్సు: దరఖాస్తు చేసుకునేందుకు కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 25 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం కొందరి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది., OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.20,200 ఉంటుంది. ఇంకా ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://indianarmy.nic.in/
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 194
దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 24