BigTV English

Section Controller: ఇండియన్ రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 వరకు జీతం, దరఖాస్తు 7 రోజులే గడువు

Section Controller: ఇండియన్ రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 వరకు జీతం, దరఖాస్తు 7 రోజులే గడువు

Jobs in Indian Railways: రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పోస్టులు, ఖాళీల వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ)దేశ వ్యాప్తంగా గల అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 పోస్టులతో సెక్షన్‌ కంట్రోలర్‌ (సీఈఎన్ నెం.04/2025) పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 14 వరకు ఆన్‌ లైన్‌ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోట్: దరఖాస్తుకు 7 రోజులే గడువు


జోన్‌ల వారీగా ఖాళీలు, ఎగ్జాన్ విధానం, తదితర నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా విడదుల చేయనున్నారు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 368

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు లో సెక్షన్ కంట్రోలర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – కేటగిరీ వారీగా వివరాలు

యూఆర్: 174 పోస్టులు

ఎస్సీ: 56 పోస్టులు

ఎస్టీ: 34 పోస్టులు

ఓబీసీ: 80 పోస్టులు

ఈడబ్ల్యూఎస్: 24 పోస్టులు

విద్యార్హత: డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: సీబీటీ, సీబీఏటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

ఆర్ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, గోరఖ్‌పూర్, తిరువనంతపురం రీజియన్లలో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: సెప్టెంబర్ 15

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 14

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.35,400 వరకు జీతం ఉంటుంది.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 20 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbcdg.gov.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 368

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 14

ALSO READ: RRC: పదో తరగతి అర్హతతో రైల్వేలో 2094 ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే జాబ్

Related News

Indian Army: ఇండియన్ ఆర్మీలో గ్రూప్-సీ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు అప్లై చేసుకోవచ్చు, మంచివేతనం.. డోంట్ మిస్

RRC: పదో తరగతి అర్హతతో రైల్వేలో 2094 ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే జాబ్

RRB JE POSTS: రైల్వేలో 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీ వేతనం, ఈ అర్హత ఉంటే చాలు

RRB NTPC: రైల్వేలో 8850 ఎన్టీపీసీ పోస్టులు.. ఈ జాబ్ వస్తే గోల్డెన్ లైఫ్.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

DDA Recruitment: ఇంటర్, డిగ్రీ అర్హతలతో 1732 ఉద్యోగాలు.. ఇలాంటి ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ బ్రదర్, రేపటి నుంచే దరఖాస్తు ప్రక్రియ

Scholarship Scheme: ఇంటర్ సర్టిఫికెట్ ఉందా..? ఛలో ఈజీగా రూ.20,000 పొందండి, ఇదిగో సింపుల్ ప్రాసెస్

BEL Notification: బెల్ నుంచి భారీ నోటిఫికేషన్.. జీతం అక్షరాల రూ.40వేలు, దరఖాస్తుకు 2 రోజులే గడువు

Big Stories

×