TGSRTC: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది భారీ గుడ్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వెయ్యి డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు గానూ టీజీఎస్‌ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన విద్యార్హత, వేతనం, వయస్సు, దరఖాస్తు విధానం, ఎగ్జామ్ వివరాలు గురించి త్వరలోనే తెలుసుకుందాం..
టీజీఎస్‌ఆర్టీసీలో 1743 ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డ్రైవర్, శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అవ్వనుంది. అక్టోబర్ 28న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.tgprb.in/
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1743
దరఖాస్తు తేదీలు: అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు..
జీతం:
డ్రైవర్ పోస్టులకు: 20,960 నుంచి రూ.60,080 వరకు వేతనం ఉంటుంది
శ్రామిక్ పోస్టులకు: రూ.16,550 నుంచి రూ.45,030 వరకు వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి..
దరఖాస్తు ఫీజు: డ్రైవర్ పోస్టులకు రూ.600, శ్రామిక్ పోస్టులకు రూ.400 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డ్రైవర్ పోస్టులకు రూ.300, శ్రామిక్ పోస్టులకు రూ.200 ఫీజు ఉంటుంది.
వయస్సు: డ్రైవర్ పోస్టులకు 2025 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల వయస్సు మించరాదు. 22 ఏళ్ల వయస్సుకు తక్కువ ఉండరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడేళ్లు అదనంగా వయస్సు సడలింపు ఉంటుంది.
శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. జులై 1 నాటికి 30 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కు అదనంగా మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: డ్రైవర్ పోస్టులకు పదో తరగతి కచ్చితంగా పాసై ఉండాలి.. శ్రామిక్ పోస్టులకు మెకానిక్ విభాగంలో ఐటీఐ పాసై ఉండాలి.
డ్రైవింగ్ లైసెన్స్: డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.. హెవీ పాసెంజర్ మోటార్ వెహికల్ (హెచ్ఎంపీవీ), హెవీ గూడ్స్ వెహికల్ (హెచ్‌జీవీ) లైసెన్స్ ఉండాలి.
నోటిఫికేషన్ కీలక సమాచారం: