Happy Divorce: ఇటీవల కాలంలో విడాకులను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న ఓ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అవుతుంది. భార్య నుంచి విడాకులు రావడంతో తన తల్లితో కలిసి ఓ వ్యక్తి సెలబ్రేట్ చేసుకున్నాడు. తల్లి కొడుక్కి పాలాభిషేకం చేసింది. అనంతరం కొత్త దుస్తులు ధరించి “హ్యాపీ డివోర్స్” కేక్ కట్ చేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో బిరాదార్ డీకే అనే వ్యక్తి పోస్టు చేశాడు.
ఇన్ స్టా గ్రామ్ వీడియో క్యాప్షన్ గా “హ్యాపీగా ఉండండి. నిరాశ చెందకండి. 120 గ్రాముల బంగారం, రూ.18 లక్షల నగదు నేను ఇవ్వలేదు. ఇప్పుడు నేను సింగిల్, హ్యాఫీ, నాకు స్వాతంత్ర్యం వచ్చింది. నా జీవితం నా రూల్స్ నా ఇష్టం. ఒంటరి జీవితమే హ్యాపీ” అని పోస్ట్ పెట్టాడు.
‘విడాకులను సెలబ్రేట్ చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. విడాకులపై అభిప్రాయాలు మారుతున్నాయి’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. “దయచేసి మళ్లీ పెళ్లి చేసుకోకండి. నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ తల్లి చాలు. హ్యాపీగా ఉండండి” అని ఓ యూజర్ కామెంట్ చేశారు.
?utm_source=ig_web_copy_link
“నీ జీవితం కోసం నిలబడ్డావు. బయట సమాజం కోసం ఒక వివాహం చేసుకుని, ఎన్నో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులూ ఉన్నారు” అని మరొక యూజర్ స్పందించారు. “నీ కొత్త జీవితానికి అభినందనలు, దానిని మెరుగుపరుచుకో” అని మరో నెటిజన్ స్పందించారు.
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో కోర్టు విడాకులు జారీ చేసింది. వీరి విడాకుల కేసుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇటీవల ఈ విషయంపై ధనశ్రీ స్పందించింది. తన మాజీ భర్త తప్పు చేసినప్పుడు కూడా అతనికి మద్దుతు తెలిపినట్లు చెప్పింది.