Sandeep Reddy Vanga Kurtas : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నారు. అయితే చాలామంది దర్శకులు ఎక్కువ సినిమాలు చేసి తమకంటూ మంచి సక్సెస్ తో పేర్లు సాధిస్తారు. ఇంకొంతమంది దర్శకులకు ఎక్కువ సినిమాలు ఉంటాయి. వాటిలో సక్సెస్ లు కూడా ఉంటాయి. కానీ దర్శకులుగా మాత్రం వాళ్లకు సపరేట్ ఫ్యాన్స్ ఉండరు. ఆ దర్శకులు ఏదైనా హీరోతో సినిమా చేస్తే ఆ హీరోని బట్టి వెళ్లి చూస్తారు.
దర్శకుడు హీరో మీద అంచనాలు ఉంటే దానినే పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటారు. అందుకే చాలామంది ప్రేక్షకులు మాట్లాడుతూ వీరి కాంబినేషన్లో ఒక సినిమా పడితే ఉంటుంది గురు అంటుంటారు. అయితే అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే తీసినవి ఒకటి రెండు సినిమాలు అయినా కూడా చాలామంది మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఆ దర్శకులు ఎన్ని ఫెయిల్యూర్స్ చేసిన వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ మాత్రం పోదు. ఉదాహరణకు రాంగోపాల్ వర్మ శివ సినిమా ఉంది. ఇప్పటికీ ఆయన గురించి ప్రస్తావన వస్తే శివ గురించి మాట్లాడుతారు. కారణం ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్.
శివ సినిమా తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా కి కూడా విపరీతమైన పేరు వచ్చింది. ఇప్పుడు సందీప్ అంటే ఒక బ్రాండ్. చాలా తక్కువ మందికి మాత్రమే ఇటువంటి ఫ్యాన్ బేస్ వస్తుంది.
ఒక దర్శకుడిని కొంతమంది ఇష్టపడినప్పుడు వ్యక్తిగతంగా ఆ దర్శకుడు వ్యవహరించిన తీరు. వేసుకునే బట్టలు. మాట్లాడే విధానం వీటన్నిటి పైన కూడా కొంతమందికి ఆసక్తి ఉండటం సహజం. అతనిని విపరీతంగా పరిశీలించడానికి అలవాటు పడతారు. ఆ తరుణంలో కొన్ని విషయాలు ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి.
ఇక సందీప్ రెడ్డి విషయానికి వస్తే ఎప్పుడు చూసినా కూడా మిగతా దర్శకులు కంటే తన డ్రెస్సింగ్ స్టైల్ సపరేట్ గా ఉంటుంది. ఎక్కువ శాతం కుర్తాలు వేసుకుని కనిపిస్తాడు సందీప్ రెడ్డి వంగ. జీన్స్ షర్ట్స్ వేసుకుని సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. కొన్ని ఈవెంట్స్ కి హాజరైన రియాలిటీ షోస్ కి హాజరైన రంగురంగులు కుర్తాలతో లాంగ్ హెయిర్ తో దర్శనం ఇస్తాడు.
సందీప్ రెడ్డి వంగ ఫిలిం స్కూల్లో చదువుకున్నాడు. ఫిలిం స్కూల్లో చదువుకున్న తర్వాత ఇండియాకు వచ్చి నాగార్జున నటించిన కేడీ అనే సినిమాకు పని చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు.
కేడి సినిమాకు పని చేసిన తర్వాత ఇంకో సినిమాకి పనిచేయకూడదు అని డిసైడ్ అయిపోయాడు. డైరెక్షన్ చేద్దాం అని కథ రాసుకున్నాడు. అయితే ఆ తరుణంలో చాలా రిజెక్షన్స్ సందీప్ కి వచ్చాయి. ఎక్కువగా ఇంట్లో ఉండి కథ రాసుకోవడం వలన తన దగ్గర రాత్రిపూట వేసుకొని కుర్తా పైజామా ఒకటి ఉంటే అది వేసుకోవడం మొదలుపెట్టాడు.
అలా రెండు మూడు రోజులు వేసుకున్న తర్వాత తనకు బాగా కంఫర్ట్ గా అనిపించింది. రోజు ఖాళీగా ఇంట్లో జీన్స్ షర్ట్స్ వేసుకొని ఏం తిరుగుతాం అని, కుర్తా పైజామా వేసుకోవడానికి అలవాటు పడిపోయాడు. అదే అలవాటుని వదులుకోలేక ఎక్కువ సందర్భాల్లో బయట కూడా ఇప్పుడు అలానే కనిపిస్తాడు. సెట్స్ లో కూడా సందీప్ ఎక్కువ శాతం కుర్తాలని ధరిస్తారు.
Also Read : Pawan Kalyan : మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మరోసారి పీపుల్ మీడియాలో