MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మహేంద్రసింగ్ ధోని (MS Dhoni ) మరో అదిరిపోయే శుభవార్త చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో మరో అంతర్జాతీయ స్టేడియానికి మహేంద్రసింగ్ ధోని శ్రీకారం చుట్టారు. ఇవాళ ధోని చేతుల మీదుగా మధురై క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు మహేంద్రసింగ్ ధోని. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం పూట రాంచీ నుంచి నేరుగా తమిళనాడుకు చేరుకున్నారు ధోని. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ధోని కోసం ఎగబడ్డారు. మధురై చేరుకున్న తర్వాత నేరుగా స్టేడియానికి వెళ్లి, దాదాపు రూ. 325 కోట్ల తో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్టేడియాన్ని ప్రారంభించారు. స్టేడియం ప్రారంభించిన తర్వాత గ్రౌండ్ లో కాసేపు ప్రాక్టీస్ కూడా చేశారు. వచ్చే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడ కూడా మ్యాచ్ లు ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో పర్మిషన్…దుబాయ్ లో వదిలేశాడుగా !
మహేంద్రసింగ్ ధోని (MS Dhoni ) ఇవాళ మధురైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమిళనాడులోని రెండో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అయిన మధురై స్టేడియాన్ని ప్రారంభించారు ధోని. ఈ సందర్భంగా ఓ బటన్ నొక్కి, స్టేడియం ప్రారంభించారు. అనంతరం బ్యాటింగ్ చేశాడు. ఈ తరుణంలోనే, ధోని కాళ్లపై స్టేడియంలో క్రికెట్ ఆడుతున్న కుర్రాడు పడిపోయాడు. ఆ కుర్రాడి వయస్సు 15 ఏళ్లు ఉంటుందని సమాచారం.
MS Dhoni has arrived in Madurai to inaugurate a cricket stadium. Massive crowd gathered at the airport to welcome him. 🔥🔥 pic.twitter.com/trBrA1mz7e
— ` (@WorshipDhoni) October 9, 2025
A little boy touched MS Dhoni's feet in the stadium 🥹❤️ pic.twitter.com/eRc94Fl30D
— ` (@WorshipDhoni) October 9, 2025
MS DHONI INAUGURATED THE INTERNATIONAL CRICKET STADIUM IN MADURAI. 💛 pic.twitter.com/wZgQvF7j8u
— Johns. (@CricCrazyJohns) October 9, 2025