Bhagyashri Borse Iron Leg Sentiment: మొన్న పూజ హెగ్డే.. నిన్న శ్రీలీల.. ఇప్పుడు భాగ్యశ్రీ భోర్సే.. తెలుగు ఇండస్ట్రీలో ఆ సెంటిమెంట్ని కొనసాగిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీవర్గాలు. ఒక సినిమా రిజల్ట్ ఫలితం హీరోల కంటే హీరోయిన్లపైనే ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే అది హీరోయిన్ లెగ్గే.. ప్లాప్ అయినా అది హీరోయిన్ లెగ్గే కారణమంటారు. అలా తెలుగులో లెక్కీ లెగ్ నుంచి ఐరన్ లెగ్ ట్యాగ్ వేసుకుంది పూజ. వరుసగా హిట్స్ అందుకున్నప్పటీకి తమిళ చిత్రం బీస్ట్తో పూజకు ఐరన్ లెగ్ ముద్ర పడింది. దీంతో తెలుగు పూజ జాడ లేకుండ పోయింది. అదే టైంలో ‘పళ్లి సందD’ సినిమాతో శ్రీలీల తెలుగులో అడుగుపెట్టింది. ఈ చిత్ర పెద్ద డిజాస్టర్. నిర్మలా కాన్వెంట్ మంచి గుర్తింపు పొందిన రోషన్ హీరోగా పరిచయం అవుతూ చేసిన చిత్రమిది.
ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించింది. మ్యూజికల్ పరంగా హీట్ అయిన ఈ సినిమా థియేట్రికల్గా ప్లాప్ అయ్యింది. దీంతో రోషన్కి భారీ డిజాస్టర్ తప్పలేదు. ఆ తర్వాత శ్రీలీల ఆదికేశవ, ధమకా వంటి చిత్రాల్లో నటించింది. ఇవి కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో శ్రీలీలకు ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. బ్యాక్ టూ బ్యాక సినిమాలు అయితే చేస్తోంది కానీ, ఇప్పటి వరకు ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. భగవంత్ కేసరి, గుంటూరు కారం తప్పితే శ్రీలీల ఖాతాలో హిట్స్ లేవు. దీంతో ఈ భామకు తెలుగులో ఐరల్ లెగ్ అనే ట్యాగ్ వేసేశారు. ఇప్పుడు ఈ సెంటిమెంట్ని కొత్త భాగ్యశ్రీ కూడా తీసుకువచ్చిందంటున్నారు. అందం, అభినయం అన్ని ఉన్నా.. లక్క్ మాత్రం ఈ అమ్మడికి కలిసి రావడం లేదు.
‘యారియన్ 2′ చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. అక్కడ ఇది డిజాస్టర్ అయ్యింది. అయినా ఈ భామ గ్లామర్, అందానికి నెటిజన్స్ని మంచి మార్కులు వేశారు. దీంతో ఆమెకు తెలుగు నుంచి పిలుపు వెళ్లింది. రవితేజ మిస్టర్ బచ్చన్‌లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో తొలిపాట చూసి ఆహా భాగ్య శ్రీ ఓహో భాగ్యశ్రీ అన్నారు. మూవీ రిలీజ్ అవ్వకముందే ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. దీంతో టాలీవుడ్ మంచి హీరోయిన్ దొరికేసిందని ఇండస్ట్రీ వర్గాలు ఆశపడ్డాయి. కానీ, మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాత అంచనాలన్ని తారుమారు అయ్యాయి. మిస్టర్ బచ్చన్ ఫలితమేంటో అందరికి తెలిసిందే. రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ పడుతుందని ఆశపడ్డ ఫ్యాన్స్కి ఘోరమైన నిరాశ ఎదురైంది.
దర్శకుడు హరీష్ శంకర్ సినిమా అంటే మినిమమ్ హిట్ గ్యారంటీ. రవితేజ, హరీష్ శంకర్‌లది హిట్ కాంబో కూడా. ఈ హిట్ కాంబో రిపీట్ అవ్వడంతో హిట్ పక్కా అనుకున్నారు. కనీసం రవితేజ మాస్ మ్యానరిజం అయినా సినిమాని నిలబెడుతుందనేది ఫ్యాన్స్ నమ్మకం. కానీ, హరీష్ శంకర్ హిట్ ట్రాక్, రవితేజ మాస్ క్రేజ్ రెండూ కూడా మిస్టర్ బచ్చన్‌కి కలిసిరాలేదు. దీంతో మూవీ రిజల్ట్ ఎఫెక్ట్ భాగ్యశ్రీ భోర్సే మీద పడింది. భాగ్యశ్రీ బోర్సే ఐరన్ లెగ్ ముందు హరీష్ శంకర్-రవితేజల హిట్ కాంబో కూడా వర్కౌట్ కాలేదంటూ చెవులు కొరుక్కున్నారు. ఆ తర్వాత హీరో విజయ్తో కింగ్డమ్ జతకట్టింది. స్క్రీన్ ఆమె పెద్దగా కనిపించలేదు కానీ, ఆమె ఐరన్ లెగ్ ప్రభావం భారీగానే పడిందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వరుస ప్లాప్స్తో ఉన్న విజయ్తో కింగ్డమ్ బ్లాక్బస్టర్ కొడతాడని అంతా అనుకున్నారు.
Also Read: Peddi Movie: షాకింగ్.. పెద్ది షూటింగ్ క్యాన్సిల్
ఇది ఇండస్ట్రీ హిట్ కొడుతుందని మూవీ టీం కూడా గట్టిగా నమ్మింది. కానీ, చివరికి ‘కింగ్డమ్’ యావరేజ్గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్ కొడుతుందనుకున్న ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది. కింగ్డమ్ ఆశించిన విజయం సాధించకపోవడానికి భాగ్యశ్రీనే అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ‘ఆంధ్రకింగ్ తాలుకా‘ చిత్రంలో నటిస్తోంది. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఇందులో ఆమె హీరోయిన్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమాకు పెద్దగా బజ్ కనిపిచడం లేదు. ఆంధ్రకింగ్ తాలుకా వంటి చిత్రం ఒకటి ఉందని కొంతమంది ఆడియన్స్కి కూడా తెలియదు. వరుస ప్లాప్స్తో డిలా పడ్డ రామ్కి ఈ మూవీ హిట్ చాలా ముఖ్యం. అలాంటి రామ్కి భాగ్యశ్రీ బోర్సే ఎలాంటి ఫలితాన్నిఇస్తుంది. ఆమె ఐరన్ లెగ్ సెంటిమెంట్ ఆంధ్రకింగ్ తాలుకాపై ఎఫెక్ట్ చూపుతుందా? లేదా గట్టేక్కిస్తుందా? చూడాలి!