Trivikram Venkatesh movie : చాలామంది దర్శకులకు ఒక బ్రాండ్ ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే దర్శకుడు కంటే కూడా రచయితగా మంచి పేరు ఉంది. ఎవరైనా ఈ రోజుల్లో ఒక గొప్ప మాట రాస్తే త్రివిక్రమ్ లా రాస్తున్నావు అంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటే అద్భుతమైన రైటర్లు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే ఆ రైటర్ల గురించి ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి అందరూ త్రివిక్రమ్ పేరుని ప్రస్తావిస్తారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆ రేంజ్ ఇంపాక్ట్ మాటలు రాయటంలో క్రియేట్ చేశారు అంటే అది మామూలు విషయం కాదు. ఒక తరుణంలో కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు పోస్టర్ మీద చూసి సినిమాలకు వెళ్లిన ఆడియన్స్ కూడా ఉన్నారు. ఇప్పటికీ స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వే కావాలి, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి ప్రస్తావని తీసుకొచ్చినప్పుడు త్రివిక్రమ్ పేరే అందరికీ టక్కును గుర్తొస్తుంది. రచయితగా అన్ని సినిమాల్లో సక్సెస్ సాధించారు. ఇప్పుడు త్రివిక్రం కాస్త జాగ్రత్త పడాల్సి ఉంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి బాగా పరిశీలన చేసిన వాళ్లకి తెలిసే విషయం కొన్ని సినిమాల నుంచి కాపీ చేస్తారు అని. త్రివిక్రమ్ అంటే ఇష్టం ఉన్న చాలా మంది ఇన్స్పిరేషన్ అని పేరు పెడతారు. ఇంకొంతమంది కాపీ కాదు తస్కరించడం అని వెటకారం చేస్తారు. అయితే వీటన్నిటికీ త్రివిక్రం ఒక ఇంటర్వ్యూలో సమాధానం కూడా చెప్పాడు.
అప్పట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ ఇదివరకే కథల రాయడం చాలా ఈజీగా ఉండేది. పది ఇంగ్లీష్ సినిమాలు చూసి ఒక తెలుగు కథ రాసే వాళ్ళం. ఇప్పుడు అలా కుదరదు. ఏ సినిమా నుంచి కాపీ కొట్టిన ఇది ఇక్కడి నుంచి లేపేసాడు అని ఈజీగా చెప్పేస్తారు అని త్రివిక్రమ్ అప్పట్లో చెప్పారు.
ఇప్పుడు త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. ఇదివరకే మీరు కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల్లో చాలా కాపీ సీన్స్ ఉంటాయి. సినిమాలు రిలీజ్ అయినప్పుడు అవి పెద్దగా కాపీ సీన్స్ అని ఎవరికీ తెలియదు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు చేస్తే చిక్కుల్లో పడిపోయినట్లే.
మామూలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటేనే డైలాగుల కోసం చాలామంది వస్తారు. అలానే ఆయన రాసే ఫన్ లైన్స్ కూడా బాగుంటాయి. ఈసారి మాత్రం ఎక్కడా కాపీ సీన్స్ పెట్టకుండా, స్వయంగా ఆయన మెదడుకు పని పెట్టి ఈ సినిమాలోని సన్నివేశాలు రాయాల్సి ఉంది. అలా రాస్తేనే చాలా ట్రోల్స్ నుంచి బయటపడొచ్చు.
అలాకాకుండా గత సినిమాలకు చేసినట్లు ఇప్పుడు చేస్తే అది రిస్క్. ఎందుకంటే ఈరోజుల్లో ఆడియన్స్ ఓటిటిలో తెలుగు సినిమాల కంటే కూడా ఎక్కువగా ప్రపంచ సినిమాను చూడటం మొదలుపెట్టారు. అందుకే సినిమాల విఎఫ్ఎక్స్ విషయంలో కూడా కొద్దిపాటి తేడా వచ్చినా కూడా క్షమించకుండా ట్రోల్ చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ అంచనాలను ఎంతవరకు నిలబెట్టుకొని వెంకటేష్ తో హిట్ కొడతారు వేచి చూడాలి.
Also Read: Sandeep Reddy Vanga Kurtas : సందీప్ రెడ్డి వంగ ఎక్కువగా కుర్తాల్లో కనిపించటానికి కారణం ఇదే