BigTV English

Indian Railway Jobs: రైల్వేలో భారీగా పారా మెడికల్ ఉద్యోగాలు.. మంచి వేతనం, రేపే లాస్ట్ డేట్

Indian Railway Jobs: రైల్వేలో భారీగా పారా మెడికల్ ఉద్యోగాలు.. మంచి వేతనం, రేపే లాస్ట్ డేట్

Indian Railway Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ముఖ్యమైన తేదీలు, పోస్టులు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


NOTE: రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది..

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు 434 పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సెప్టెంబర్ 18న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 434

రైల్వే రిక్రూట్మెంట్ లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నర్సింగ్ సూపరెంటెండెంట్, ఫార్మాసిస్ట్, రేడియో గ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేట్-2, డయాలిసిస్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వివరాలు:

నర్సింగ్ సూపరిండెంట్ : 272 పోస్టులు

ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) : 105 పోస్టులు

రేడియో గ్రాఫర్ (ఎక్స్- రే టెక్నీషియన్) : 4 పోస్టులు

ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ -2 : 12 పోస్టులు

డయాలిసిస్ టెక్నీషియన్: 4 పోస్టులు

హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్-2 : 33 ఉద్యోగాలు

ఈసీజీ టెక్నీషియన్: 4 ఉద్యోగాలు

విద్యార్హత: డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ కెమిస్ట్రీ, డీఎంఎల్టీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.

జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగానికి రూ.44,900 జీతం ఉంటుంది. ఫార్మాసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) ఉద్యోగానికి రూ.29,200 జీతం ఉంటుంది. రేడియోగ్రాఫర్ ఉద్యోగానికి రూ.29,200 జీతం ఉంటుంది. హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్-2 ఉద్యోగానికి రూ.35,400 జీతం ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-2 రూ.21,700 జీతం ఉంటుంది. డయాలిసిస్ టెక్నీషియన్ రూ.35,400 జీతం ఉంటుంది. ఈసీజీ టెక్నీషియన్ రూ.25,500 జీతం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్ట్ 9

దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 18

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://indianrailways.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 434

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 8

ALSO READ: DMart Jobs: డిమార్ట్ లో జాబ్ కావాలా? జస్ట్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు!

Related News

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

IBPS RRB: డిగ్రీ అర్హతతో 13,217 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే బంగారు భవిష్యత్తు, ఇంకా 4 రోజులే

IOCL Jobs: పదో తరగతి అర్హతతో భారీగా జాబ్స్.. మంచి వేతనం.. 2 రోజులే గడువు

Prasar Bharati: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.80,000 జీతం.. ఈ అర్హత ఉంటే చాలు

DSSSB: ఇంటర్ అర్హతతో భారీగా జాబ్స్.. తక్కువ పోటీ.. వెంటనే అప్లై చేయండి బ్రో

ESIC Jobs: ఈఎస్ఐసీలో 243 ఉద్యోగాలు.. రూ.2,08,700 జీతం, దరఖాస్తుకు ఇంకా 2 రోజులే సమయం

DDA Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. డీడీఏలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్, పూర్తి వివరాలివే

Big Stories

×