Team India : ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా అరుదైన రికార్డు… ఇప్పటివరకు ఏ జట్టు సాధించని చరిత్ర ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా అరుదైన రికార్డు సాధించింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో భారత్ ఆధిప్యత్యం సంపూర్ణమైంది. టీ-20 వరల్డ్ కప్ విజయం సాధించినప్పటి నుంచి టీమిండియా నెంబర్ వన్ టీ-20 జట్టుగా చలామణి అవుతుంది. బ్యాటర్ల విభాగంలో భారత్ కి చెందిన అభిషేక్ శర్మ నెంబర్ టీ-20 బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ల విభాగంలో భారత్ కి చెందిన హార్దిక్ పాండ్ఆయ నెంబర్ వన్ కొనసాగుతున్నాడు. తాజాగా వరుణ్ చక్రవర్తి నెంబర్ వన్ బౌలర్ గా అవతరించడంతో టీ-20 ఫార్మాట్ లో భారత్ అన్ని విభాగాల్లో టాప్ ప్లేస్ సాధించినట్టయింది.
Also Read : Pakistan : పాక్ కి అవమానం.. తోక ముడిచి, మాట తప్పి.. UAE తో మ్యాచ్ కి ఓకే చెప్పారుగా..!
ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ ఆధిపత్యం టీ-20లకే పరిమితం కాలేదు. వన్డేల్లోనూ భారత్ నెంబర్ వన్ జట్టుగా కొనసాగుతుంది. ఈ ఫార్మాట్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా టీమిండియా కే చెందిన శుబ్ మన్ చలామణి అవుతున్నాడు. అలాగే టెస్ట్ ర్యాంకింగ్స్ లో కూడా భారత్ హవా కొనసాగుతోంది. నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ గా బుమ్రా కొనసాగుతున్నాడు. నెంబర్ వన్ టెస్ట్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా ఉన్నాడు. ఓవరాల్ గా చూస్తే.. అన్ని ఫార్మాట్ల ర్యాంకింగ్స్ లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. గత కొంత కాలంగా అద్భుతమైన ప్రదర్శనలతో చెలరేగుతున్న వరుణ్.. న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ ని అధిగమించి టాప్ ప్లేస్ కి చేరాడు.
వాస్తవానికి గత వారం ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో ఉన్న వరుణ్.. తాజాగా మూడు స్థానాలు ఎగబాకి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. దీంతో భారత్ తరపున నెంబర్ వన్ గా అవతరించిన మూడో బౌలర్ గా చరిత్రకెక్కాడు. వరుణ్ కి ముందు జస్ప్రిత్ బుమ్రా, రవి బిష్ణోయ్ నెంబర్ వన్ టీ-20 బౌలర్లుగా చలామణి అయ్యారు. 2021లో టీ-20 ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో ఉండిన వరుణ్.. మూడు స్థానాలు ఎగబాకి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. భారత్ తరపున నెంబర్ వన్ గా అవతరించిన మూడో బౌలర్ గా చరిత్రలకెక్కాడు. వరుణ్ ముందు జస్ప్రిత్ బుమ్రా, రవి బిష్షోయ్ నెంబర్ వన్ టీ-20 బౌలర్లుగా చలామణి అయ్యారు. వారిద్దరి తరువాత వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. 2021లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. కెరీర్ లో20 టీ-20 మ్యాచ్ లు ఆడిన అతను.. 2, 5 వికెట్ల ప్రదర్శనతో మొత్తం 35 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్నవరుణ్ అక్కడా కూడా మెరుగైన ప్రదర్శనలే చేస్తున్నాడు.
రికార్డు సృష్టించిన టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి.