Mohini: బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన ‘ఆదిత్య 369’ సినిమాతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది ప్రముఖ హీరోయిన్ మోహిని (Mohini). ఈ చిత్రంలో తన నటనతో , అందంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. తెలుగు సినీ రంగంలో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. అలా ఒకటి రెండు చిత్రాలతోనే భారీ ఫేమస్ అయిన ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. తనకు ఎటువంటి కష్టాలు లేకపోయినా ఏకంగా ఏడుసార్లు ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఎందుకు మోహిని ఇలాంటి ప్రయత్నాలు చేసింది? అసలేం జరిగింది? అనే విషయాలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
ఇంటర్వ్యూలో భాగంగా మోహిని మాట్లాడుతూ.. “2011లో చివరిసారి వెండితెరపై కనిపించాను. 23 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్నాను. పెళ్లి తర్వాతే సినిమాలకు దూరమై భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డాను. వివాహం తర్వాత భర్త, పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడిపాను. కానీ ఒక సమయంలో నాకు తెలియకుండానే డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. నాకు తెలియకుండానే ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించాను.. అయితే ఆ సమయంలో ఒక జ్యోతిష్కుడుని కలవగా.. ఆయన నాపై చేతబడి చేయించారు అని చెప్పారు. అయితే మొదట్లో ఈ విషయం విని నాకు నవ్వు వచ్చినా.. ఆ తర్వాత నేను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని భావించి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత భగవంతుడిని నమ్ముకొని దాని నుంచి బయటపడ్డాను” అంటూ మోహిని తెలిపింది. తన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకపోయినా ఈ చేతబడి కారణంగానే ఇలా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాను అని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది మోహిని.
ALSO READ:Suman Setty House : సుమన్ శెట్టి ఇంట్లో ఈ డైరెక్టర్‌కు స్పెషల్ రూం.. బిగ్ సీక్రెట్ రివీల్!
చేతబడి చేయించారంటూ..
ఇకపోతే ఇండస్ట్రీలో ఇలా చేతబడి చేయించారని చెప్పడం ఈమె మొదటి వ్యక్తి కాదు. ఇటీవల యాంకర్ రవి (Anchor Ravi) కూడా తనపై బ్లాక్ మ్యాజిక్ జరిగింది అంటూ ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ముఖ్యంగా జీవితంలో ఎదుగుతున్న క్రమంలోనే కొంతమంది తట్టుకోలేక ఇలా బ్లాక్ మ్యాజిక్ చేయించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు..
మోహిని విషయానికి వస్తే.. బాలనటిగా రఘువరన్, అమల నటించిన కూట్టు పుజుక్కల్ (1987) అనే చిత్రం ద్వారా హీరోకి చెల్లెలి పాత్రలో నటించి ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత హిందీలో కూడా చిత్రాలలో నటించిన ఈమె.. సౌత్ సినీ ఇండస్ట్రీలో దాదాపు 100కు పైగా చిత్రాలలో నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అంటూ ప్రతి భాషా చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
జీసస్ నన్ను కాపాడాడు..
ఇకపోతే ఈమె తమిళనాడులోని తంజావూరులో మహాలక్ష్మి గా జన్మించింది. చెన్నైలోని చిల్డ్రన్స్ గార్డెన్ హైయర్ సెకండరీ స్కూల్లో చేరిన ఈమె.. 2006లో క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. ఇప్పుడు కూడా తనను జీసస్ కాపాడాడు అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది మోహిని.