దేశంలోని ప్రముఖ రిటైల్ కంపెనీలలో డిమార్ట్ ఒకటి. ప్రస్తుతం నగరాలతో పాటు పట్టణాలలో కలిపి 300లకు పైగా స్టోర్లు ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది కస్టమర్ల డిమార్ట్ లో సామాన్లు కొనుగోలు చేస్తారు. నిత్యవసర సరుకుల నుంచి మొదలుకొని గృహోపకరణాల వరకు తక్కువ ధరకే లభిస్తాయి. తక్కువ లాభంతో వినియోగదారులకు సేవలు అందించడంతో పాటు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులను కూడా ఎంతో గౌరవంగా చూసుకుంటుంది యాజమాన్యం. టైమ్ టు టైమ్ సాలరీస్, బోనస్ లు, టిప్స్ సహా బోలెడు అదనపు సదుపాయాలు కల్పిస్తుంది. ఇంతకీ డిమార్ట్ లో ఉద్యోగం సంపాదించాలంటే ఎలా? క్వాలిఫికేషన్ ఏం ఉండాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
డీమార్ట్ లో ఉద్యోగం పొందాలంటే క్వాలిఫికేషన్లు పొజిషన్, నిర్వహించే పనుల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఎంట్రీ లెవల్ లేదంటే ఫ్రెషర్ పొజిషన్లకు 10వ తరగతి లేదంటే 12వ తరగతి పాసై ఉంటే సరిపోతుంది. అయితే, మేనేజర్, సీనియర్ రోల్స్ క గ్రాడ్యుయేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి.
మినిమమ్ 10వ తరగతి, లేదా 12వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఫ్రెషర్లు (ఎక్స్ పీరియన్స్ లేకుండా) అప్లై చేయవచ్చు. కస్టమర్ సర్వీస్, టీమ్ వర్క్, పాజిటివ్ అటిట్యూడ్ లాంటి స్కిల్స్ ఉంటే సరిపోతుంది.
డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ అవసరం. 1-2 సంవత్సరాల రిటైల్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, HR బ్యాక్ గ్రౌండ్ అయితే ఇంకా బాగుంటుంది.
గ్రాడ్యుయేషన్ (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, HR, సైకాలజీ వంటివి ప్రిఫర్డ్) ఉండాలి. 5-10 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ అవసరం. కమ్యూనికేషన్, లీడర్ షిప్, ఆర్గనైజేషన్ లాంటి స్కిల్స్ ఉండాలి.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?
ఏజ్ లిమిట్ సాధారణంగా 18-39 సంవత్సరాలు ఉండాలి. డీమార్ట్ అధికారిక వెబ్‌సైట్ (dmartindia.com/careers) లేదంటే Naukri.com, Indeed లాంటి జాబ్ పోర్టల్స్ ద్వారా అప్లై చేయవచ్చు. వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. స్టార్టింగ్ సాలరీ రూ. 10,000 నుంచి రూ.45,000 వరకు ఉంటుంది. కచ్చితమైన వివరాలకు డీమార్ట్ అధికారిక సైట్ చెక్ చేయండి. లేదంటే జాబ్ పోస్టింగ్స్ చూడాలి. ఎందుకంటే రిక్రూట్‌మెంట్ 2025లో మార్పులు చేర్పులు ఉంటాయి.
Read Also: డిమార్ట్ చాటున బడా మోసం.. ఇలా చేశారంటే మీ డబ్బులన్నీ లూటీ!