OICL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అని చెప్పవచ్చు.. ఒరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్) లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియ్, డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, మొత్తం పోస్టులు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL)లో 500 క్లాస్-III కేడర్- అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 2 నుంచి 17 తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రిలిమినరి పరీక్ష సెప్టెంబర్ 7న టైర్-2 మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబరు 28న నిర్వహించనున్నారు.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 500
ఇందులో అసిస్టెంట్ క్లాస్ – కేడర్ 3 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా 26 పోస్టుల వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఎస్‌ఎస్‌సీ/హెచ్‌ఎస్‌సీ/ఇంటర్మీడియట్/డిగ్రీలో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో పాసై ఉంటే సరిపోతుంది. దరఖాస్తు చేసిన స్టేట్/యూనియన్ టెరిటరీ రీజినల్ లాంగ్వేజ్‌లో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
ముఖ్యమైన డేట్స్:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్ట్ 2
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 17
ప్రిలిమనరీ ఎగ్జామ్: 2025 సెప్టెంబర్ 7
మెయిన్స్ ఎగ్జామ్: 2025 అక్టోబర్ 28
వయస్సు: 2025 జులై 31 నాటికి ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.22,405 నుంచి రూ.62,265 వరకు జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష (టైర్-I), మొయిన్స్ ఎగ్జామ్ (టైర్-II), రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జీకే నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.850 ఫీజు పే చేసి ఉద్యోగానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, తిరుపతి, రాజమహేంద్రవరం.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://orientalinsurance.org.in/careers
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 17
ALSO READ: Indian Railway: ఇండియన్ రైల్వేలో 6238 ఉద్యోగాలు.. సూపర్ జాబ్స్.. దరఖాస్తు 4 రోజులే..!