E-Paper
Advertisement

BEL Recruitment: డిప్లొమా, డిగ్రీ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.27,500.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

BEL Recruitment: డిప్లొమా, డిగ్రీ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.27,500.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

BEL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీసీఏ, బీఈడీ, బీఎస్సీ, డిప్లొమా, బీ.ఎల్.ఐబీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) బెంగళూరు ఫ్యాకల్టీ అండ్‌ నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 1న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఓ సారి నోటిఫికేష్ పూర్తి వివరాలను చూద్దాం.

Advertisement

మొత్తం వెకెన్సీల సంఖ్య: 57

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, పీఈటీ, పీఆర్ టీ, మ్యూసిక్, ఆర్ట్, డాన్స్, టీజీటీ, జీపీటీ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీసీఏ, బీఈడీ, బీఎస్సీ, డిప్లొమా, బీ.ఎల్.ఐబీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఫిల్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 1

ఏప్రిల్ 1 లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులకు 45 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి నెలకు రూ.16,270 ఉంటుంది. పీఈటీ, పీఆర్‌టీ, మ్యూసిక్, ఆర్ట్, డాన్స్, టీచర్ ఉద్యోగాలకు నెలకు రూ.21,250 జీతం ఉంటుంది. టీజీటీ, జీపీటీ పోస్టులకు రూ.26,250 జీతం ఉంటుంది. పీజీ పోస్టులకు రూ.27,500 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చిరునామా: దరఖాస్తును ది సెక్రటరీ-బీఈఈఐ బెల్ హైస్కూల్ బిల్డింగ్‌, జలహళ్లిపోస్ట్‌, బెంగళూరు-560013 కు చిరునామా పంపాలి.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 57

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: ఏప్రిల్ 1

ALSO READ: BANK OF BARODA: గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడగింపు

ALSO READ: NPCIL Recruitment: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో జాబ్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది.. మంచి వేతనం..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×