APMSRB Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ సంబంధించి పోస్టులు, విద్యార్హత, వయస్సు, జీతం, ఉద్యోగ ఎంపిక విధానం గురించి సవివరంగా తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (NMHP), టెలి మానస్ (Tele MANAS) సెల్‌లలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 76 పోస్టుల భర్తీకీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 76
పోస్టులు – వెకెన్సీలు:
1. కన్సల్టెంట్ సైకియార్టిస్ట్: 12
2. క్లినికల్ సైకాలజిస్ట్: 19
3. సైకియార్టిక్ సోషల్ వర్కర్: 06
4. కౌన్సిలర్: 36
5. టెక్నికల్ కో-ఆర్డినేటర్: 01
6. డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్/బీఈ, ఎంబీబీఎస్, డిప్లొమా, పీజీ, ఎం.ఫిల్/పీహెచ్‌డీ, ఎంస్/ఎండీ, ఎంఎస్‌డబ్ల్యూ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 జూన్ 5వ తేదీ నాటికి 42 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
శాలరీ: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు క్లినికల్ సైకియార్టిస్ట్‌కు రూ.1,00,000, క్లినికల్ సైకాలజిస్ట్‌కు రూ.27,500, సైకియాట్రిక్ సోషల్ వర్కర్‌కు రూ.25,000, కౌన్సిలర్‌కు రూ.18,066, టెక్నికల్ కో-ఆర్డినేటర్‌కు రూ.40,000, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,450 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 7 (నిన్నటి నుంచే ప్రారంభమైంది)
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 18
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉుంటుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈఎస్‌ఎం, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: Punjab and Sindh Bank: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు.. లాస్ట్ డేట్?
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 76
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 18