Punjab and Sindh Bank: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పంజాబ్ & సింధ్ బ్యాంక్ కాంట్రాక్ట్ విధానంలో MSME రిలేషన్‌షిప్ మేనేజర్ల పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నైపుణ్యం కలిగిన నిపుణుల ద్వారా ఎమ్ఎస్ఎస్ఈ వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచడం ఈ నియామక ప్రక్రియ లక్ష్యం. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు జూన్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వెకెన్సీలు, వయస్సు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 30
ఇందులో ఎమ్ఎస్ఎమ్ఈ రిలేషన్ షిప్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
కేటగిరీల వారీగా వెకెన్సీలు:
యూఆర్: 13 పోస్టులు
ఈడబ్ల్యూఎస్: 3 పోస్టులు
ఓబీసీ: 8 పోస్టులు
ఎస్సీ: 4 పోస్టులు
ఎస్టీ : 2 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 29
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 18
ఎవరికీ ప్రాధాన్యత: మార్కెటింగ్ లేదా ఫైనాన్స్ లో పూర్తి కాల ఎంబీఏ చేసిన వారికి ప్రియారిటీ ఉంటుంది.
వర్క్ ఎక్స్ పీరియన్స్: దేశంలో ఏదైనా బ్యాంక్, ఎన్ బీఎఫ్‌సీ లేదా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ లో ఎంఎస్ఎమ్ఈ లో రిలేషన్ షిప్ మేనేజర్ గా కనీసం మూడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
వయస్సు: 2025 మే 1 నాటి అభ్యర్థుల వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జాబ్ ప్లేస్: దేశంలో ఎక్కడైనా చేయవచ్చు. బ్యాంక్ నిర్ణయం మేరకు చేయాల్సి ఉంటుంది.
ఒప్పంద నిబంధనలు: జాబ్ లో సెలెక్ట్ అయ్యాక కొన్ని నిబంధనలు ఉంటాయి.
ప్రారంభ నియామకం: 1 ఇయర్ ఉంటుంది. పని తీరు బేస్ చేసుకుని మూడేళ్ల వరకు పొడగించవచ్చు.
జీతం: అర్హతలను అనుసరించి ఉంటుంది. 6 నెలల ప్రోబేషన్ పీరియడ్ ఉంటుంది. సిబిల్ స్కోర్ అవసరం (మినిమమ్ 650)
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://punjabandsindbank.co.in/
ALSO READ: UPSC Recruitment: డిగ్రీతో యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం రూ.2లక్షల పైనే
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 30
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 18